బంగాళదుంప వర్సెస్ చిలగడదుంప.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..!
TeluguStop.com
బంగాళదుంప,( Potato ) చిలగడదుంప.( Sweet Potato ) వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
పెద్దలే కాదు పిల్లలు కూడా ఈ రెండింటినీ ఎంతో ఇష్టంగా తింటుంటారు.బంగాళదుంప, చిలగడదుంపలతో రకరకాల డిషెస్ తయారు చేస్తుంటారు.
వీటితో స్నాక్స్ చేసిన లేక కర్రీ వండినా.రుచి మాత్రం అదిరిపోతుంది.
అయితే బంగాళదుంప, చిలగడదుంపలో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అనే డౌట్ మనలో చాలా మందికి ఉంది.
నిజానికి బంగాళదుంపలు మరియు చిలగడదుంపలు రెండూ పోషకమైనవి మరియు ఆరోగ్యకరమైనవి.అయితే సాధారణ బంగాళదంపలు కంటే చిలగడదుంపలు ఆరోగ్యానికి కొంచెం ఎక్కువ ప్రయోజనాలను చేకూరుస్తాయి.
బంగాళదుంపలు మరియు చిలగడదుంపలు రెండూ ఫైబర్ ను కలిగి ఉంటాయి.అందువల్ల ఇవి మీ కడుపును ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతాయి మరియు జీర్ణ సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి.
"""/" /
బంగాళదుంపలు ఎక్కువ ప్రోటీన్( Protien ) కలిగి ఉంటే.చిలగడదుంపల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే చిలగడదుంపలో బీటా కెరోటిన్( Beta Carotene ) మెండుగా ఉంటుంది, ఇది మీ కణాలను నష్టం మరియు వ్యాధి నుండి రక్షించే యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.
"""/" /
చిలగడదుంపలు సాధారణ బంగాళదుంపల కంటే తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి.
అందు వల్ల చిలగడదుంపలు మీ రక్తంలో చక్కెరను పెంచే అవకాశం తక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా చిలగడదుంపలు చెడు కొలెస్ట్రాల్‌ను( Bad Cholestrol ) తగ్గించడంలో మరియు గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ఇక బంగాళాదుంపల్లో కెరోటినాయిడ్లు, ఆంథోసైనిన్, ఫినోలిక్ సమ్మేళనాలు, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులను నిరోధించడంలో సహాయపడతాయి.
మరియు బంగాళదంపల్లో ఉండే విటమిన్ బి6 నరాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.ఫైనల్ గా చెప్పేది ఏంటంటే.
బంగాళదుంపలు మరియు చిలగడదుంపలు రెండూ ఆరోగ్యకరమైనవే.కానీ డీప్ ఫ్రై చేసి మాత్రం వీటిని తినరాదు.
ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ సూపర్ స్టార్స్.. ఈ ఫోటో ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అంటూ?