తిరుపతిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
TeluguStop.com
తిరుపతిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది.చిన్నారిని చిరుతే దాడి చేసి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని తెలుస్తోంది.
కాగా తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుండగా చిన్నారి లక్షిత తప్పిపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.అయితే గతంలో బాలుడిపై దాడి జరిగిన ప్రాంతంలో చిన్నారిపై చిరుత దాడికి పాల్పడింది.
చిన్నారి శరీరంపై గాయాలు ఉండగా పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి అదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!