ఆసరా పెన్షన్లలో చిల్లర హాంఫట్ చేస్తున్న పోస్టుమాస్టర్లు…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా వృద్దులకు,వితంతువులకు,ఒంటరి స్త్రీలకు,గీత,నేత, బీడీ కార్మికులకు రూ.
2016,వికలాంగులకు రూ.4016 నెలనెలా తపాలా శాఖ ద్వారా పెన్షన్ అందిస్తుంది.
అయితే నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో ఆసరా పెన్షన్ల పంపిణీలో తపాలా శాఖలోని కొందరు అధికారులు పైన ఇచ్చే రూ.
16 చిల్లర లేదంటూ, వచ్చే నెల ఇస్తామంటూ గత కొన్ని నెలలుగా ఇవ్వకుండా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని,గట్టిగా అడిగితే ఇక్కడ నుంచి వెళ్ళు ఇంకా చాలామందికి పెన్షన్ ఇవ్వాలని దురుసుగా ప్రవర్తిస్తూ ప్రతి నెలా చేతులు దులుపుకుంటున్నారని పెన్షన్ పొందే లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయం బయటికి చెపితే తమ పెన్షన్ ఇస్తారో లేదోనని భయపడుతూ ఎవరికీ చెప్పుకోకుండా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలం మొత్తం దాదాపు ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది.మండలంలో అన్ని రకాల ఆసరా పెన్షన్లు కలిపి 5488 పెన్షన్లు ప్రభుత్వం అందిస్తుంది.
అందులో వృద్ధాప్య 1637, వితంతు 2048,ఒంటరి మహిళలు 155,కల్లుగీత కార్మికులు 358,చేనేత కార్మికుల 26,దివ్యాంగులు 1264 ఇన్ని పెన్షన్ నుండి ప్రతీ నెలా రూ.
16 కట్ చేస్తే ఎంత మొత్తంలో ఆసరా పైసలు పక్కదారి పడుతున్నాయో అర్దం చేసుకోవచ్చు.
ఎంచక్కా రూ.16 నొక్కేస్తూ లబ్ధిదారుల పుస్తకంలో మాత్రం రూ.
2016, రూ.4016 ముట్టినట్టు రాసి సంతకం పెట్టిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికైనా సంబంధిత శాఖా అధికారులు స్పందించి ఆసరా కటింగ్స్ పై సమగ్ర విచారణ జరిపి బీపీఎంలపై చర్యలు తీసుకొని,నెలనెలా కటింగ్ లేకుండా పెన్షన్ ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్6, బుధవారం2024