శాడిజం.. రూ.500 లంచం ఇవ్వకపోవడంతో పాస్‌పోర్ట్ చించేసిన పోస్ట్‌మ్యాన్

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమో అలాగే పాస్‌పోర్ట్‌( Passport ) కూడా అంతే అవసరమయ్యే పరిస్థితి రావచ్చు.

అలాంటి పాస్‌పోర్ట్‌ ను సంపాదిచడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అయితే, తాజాగా ఒక వ్యక్తి 500 రూపాయలు లంచం( Bribe ) ఇవ్వలేదన్న కారణంతో ఒక పోస్ట్ మాన్ బాధితుడి పాస్‌పోర్ట్‌ పేజీని చించేశాడు.

అంతేకాకుండా ఆ పోస్ట్ మాన్( Postman ) ప్రతి పోస్ట్ డెలివరీకి వంద రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని అక్కడి స్థానికులు తెలియజేస్తున్నారు.

"""/" / ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో( Lucknow ) జరిగింది.ప్రస్తుతం బాధితుడి పాస్ పోర్ట్ ను పోస్ట్ మాన్ చింపిన సంఘటనపై గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

బాధిత వ్యక్తి పోస్టుమాన్ పై అధికారికంగా ఫిర్యాదు చేయడంతో.అధికారులు విచారణ ప్రారంభించి మరిన్ని ఆధారాల కోసం పోస్ట్ ఆఫీస్ లోని సిసిటివి ఫుటేజ్ లను పరిశీలించడం మొదలుపెట్టారు.

పోస్ట్ ఆఫీస్ లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి.

"""/" / ఈ క్రమంలో చాలామంది ఆ పోస్టుమాన్ చేసిన పనికి అతడిని విమర్శస్తున్నారు.

పబ్లిక్ సర్వీస్ లో పనిచేస్తున్న ఇలాంటి వారి వల్లనే మన ప్రభుత్వ వ్యవస్థలన్నీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయని.

అతడికి తగిన బుద్ధి, కఠిన చర్యలు తీసుకోవాలని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక వీడియో చూసిన కొంతంది ఈ లంచం కేవలం ఆ డిపార్ట్మెంట్ లో మాత్రమే కాదని, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఉందని కామెంట్ చేస్తున్నారు.

ఇలా నిర్లక్ష పనిని చేసిన ఆ ఉద్యోగిని వెంటనే విధుల నుండి తొలగించాలంటూ చాలామంది అధికారులను కోరుతున్నారు.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!