సామాజిక మాధ్యమాలలో ఇతరుల మనోభావలని రెచ్చగొట్టే విధంగా పోస్ట్ చేస్తే కఠిన చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కానీ పోస్ట్ కానీ చేయడం జరిగేనట్లతే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల మనోభావాలను దెబ్బతీసేలా విదంగా పోస్ట్ పెట్టిన వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

గంభీరావుపేట్ మండలంలోని మహిళలను అవమానించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇరు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా క్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గంభీరావుపేట్ గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాన్ అనే వ్యక్తి మీద గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, మొబైల్ ఫోన్ సీజ్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది అని అన్నారు.

ఇతరుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టు లు చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధముగ వీడియోలు కానీ ఫోటిస్ కానీ మెసేజ్ లు కానీ వాట్సప్ గ్రూప్ ల్లో పోస్ట్ చేసిన వ్యక్తుల మీద గ్రూప్ అడ్మిన్ ల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరిగుతుంది అని అన్నారు.

తెలుగు సినిమాలను చూస్తూ డైరెక్షన్ నేర్చుకుంటున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు…