పవన్ పై వైసీపీ టోన్ మారుతుందా ?
TeluguStop.com
జనసేన వైసీపీ ( Jana Sena )ల మధ్యగత కొంత కాలంగా రెండు రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ వైరం ఉన్నట్టుగా కనిపిస్తుంది.
దానికి బీజం మాత్రం వైసిపి నుంచే పడిందని చెప్పాలి.సాధారణ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని చూసిన వైసిపి ప్రభుత్వం పై గోడకు కొట్టిన బంతిలా లేచారు పవన్.
విశాఖపట్నం వేదికగా పవన్( Pawan Kalyan ) ను బయటకు రాకుండా కట్టడి చేసి అవమానించిన అధికార పార్టీపై రివెంజ్ కోసం చంద్రబాబుతో కలిశారు.
అప్పటినుంచి పవన్ పై వ్యక్తిగతంగాను, రాజకీయంగాను అనేక తీవ్ర విమర్శలు వైసిపి పార్టీ చేసింది.
ఆయన కుటుంబ సభ్యులతో సహా తీవ్రంగా అవమానించింది.దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గద్దె దించాలనే పట్టుదల పవన్ లో పెరిగింది అని చెబుతారు.
"""/" / ఒక రకంగా పవన్ను పూర్తిస్థాయి శత్రువుగా మార్చుకోవడంలో వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలే ఎక్కువ అని చెబుతారు.
ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకుంటున్న జనసేన అధికార పార్టీని ఓడించే దిశగా వేగంగా పావులు కదుపుతుంది.
మరి తమ తప్పులు గ్రహించుకున్నారో లేక యదా లాపంగా మాట్లాడారో కానీ పవన్ పై ఒకింత సాఫ్ట్ టోన్ తో మాట్లాడిన ఇద్దరు అధికార పార్టీ నేతల వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది .
పవన్ పై కొద్ది రోజులుగా విరుచుకుపడుతున్న పోసాని కృష్ణ మురళి తెలుగు అకాడమీ అధ్యక్షరాలు లక్ష్మీపార్వతి( Lakshmi Parvathi ) ఇద్దరూ పవన్ మంచివాడు అంటూ సర్టిఫికెట్ ఇచ్చేసారు.
ఆయన అమాయకుడని చంద్రబాబు కుట్రలు, వ్యూహాలు తెలియక ఆయనకు మద్దతు ఇస్తున్నారని.ఇప్పటికైనా ఆయన నిజా నిజాలు తెలుసుకొని చంద్రబాబు స్నేహంలోంచి బయటకు రావాలని వారు కోరడం కోసం కొసమెరుపు.
"""/" / నిన్నటివరకు పవన్ ని తీవ్రంగా విమర్శించి జన సైనికులలో విపరీత ఆగ్రహానికి గురైన కృష్ణమురళి నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు రిపోర్టర్ ని కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి .
సినిమాల అవకాశాల కోసం నేను పవను పొగడడం లేదని ఆయన నిజంగానే చాలా మంచివాడని పోసాని మరోసారి చెప్పడం గమనార్హం .
అయితే పవన్ పై మొదటి నుంచి వ్యూహాత్మకంగా తప్పటడుగులేసామన్న అంచనాకు అధికార పార్టీ రావడం వల్ల ఇలా మాట్లాడుతున్నారా? లేక వ్యూహాత్మకం గా పవన్ ను చందబాబు కి దూరం చేయడానికి మాట్లాడుతున్నారో గాని ఈ నేతల వాఖ్యలు మాత్రం చర్చనీయాంశం గా మారాయి
.
జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!