అలాంటి కష్టాలు అనుభవించానన్న పోసాని.. టాయిలెట్ కు వెళ్లినా భార్య ఉండాలంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన పోసాని కృష్ణమురళి( Posani Krishnamurali ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

హెర్నియా కు ఆపరేషన్ చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏకంగా ఏడు కిలోలు తగ్గానని పోసాని తెలిపారు.

ఆ సమయంలో చనిపోతానేమో అని భయం వేసిందని ఆయన కామెంట్లు చేశారు.ఆ సమస్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని పోసాని వెల్లడించారు.

డాక్టర్లు హై డోస్ ఇంజెక్షన్లు ఇస్తుంటే మొదట వద్దని చెప్పానని ఆయన తెలిపారు.

డాక్టర్ ఎన్వీ రావు( Dr.NV Rao ) నా పరిస్థితి గురించి తెలిసి ఒక స్కానింగ్ చేయించి సరిగ్గా సమస్యను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు.

అంతకుముందు టాయిలెట్ కు వెళ్లాలన్నా భార్య, అక్క తోడు ఉండి సహాయం చేయాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన తెలిపారు.

జగన్( CM Jagan ) సీఎం అయిన తర్వాత కబురు చేసినా నేను వెళ్లలేదని పోసాని పేర్కొన్నారు.

"""/" / ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore ) నన్ను పార్టీలోకి తీసుకోవాలని సలహా ఇవ్వడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.

ఎక్కడినుంచి అయినా పోటీ చేస్తారా అని కోరినా నేను మాత్రం పోటీ చేయనని చెప్పానని పోసాని అన్నారు.

నేను అడగకపోయినా పదవి ఇవ్వాలని భావించి పదవి ఇవ్వడం జరిగిందని పోసాని చెప్పుకొచ్చారు.

పదవి ఇవ్వకపోవడం వల్ల సీఎం తిడుతున్నారని చెప్పి పదవి ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.

"""/" / జగన్ గారు ఏం కావాలని అడగగా ఏమీ వద్దని చెప్పానని పోసాని చెప్పుకొచ్చారు.

సినిమాలు చేస్తూ సేవ చేయొచ్చని జగన్ చెప్పారని పోసాని కామెంట్లు చేశారు.మీరే ఒక పదవి ఇవ్వండని అడగగా అలా పదవిలో చేరడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.

అందరితో ఎలా మాట్లాడానో జగన్ తో అలాగే మాట్లాడానని పోసాని పేర్కొన్నారు.పోసాని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సూపర్ హీరో పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ.. ఈ హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!