ఆ ఇద్దరికి వచ్చాక పోసాని కూడా కోరుకుంటున్నట్లున్నాడు

మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా తరపున ప్రచారం చేసిన దర్శకుడు, రచయిత, నటుడు అయిన పోసాని కృష్ణ మురళి ఇటీవలే అనారోగ్య కారణాల వల్ల ఆపరేషన్‌ చేయించుకున్నాడు.

మొదటి ఆపరేషన్‌ తర్వాత ఇన్ఫెక్షన్‌ రావడంతో మరోసారి ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది.ఆ తర్వాత పోసాని పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు.

ప్రస్తుతం ఆయన సినిమాల్లో నటించేందుకు సిద్దం అయ్యాడు.ఆ మద్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు వైకాపా నుండి ఏదైనా నామినేటెడ్‌ పదవి కావాలా అంటూ ఆఫర్‌ వచ్చింది.

కాని నేను మాత్రం సున్నితంగా తిరష్కరించాను. """/"/ పదవి కోసం నేనేం జగన్‌ కోసం ప్రచారం చేయలేదు అంటూ అప్పుడు చెప్పిన పోసాని ఇప్పుడు తన వాయిస్‌ను మార్చినట్లుగా అనిపిస్తుంది.

తాజాగా మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ నేను ఎప్పుడు పదవి కోసం ప్రాకులాడలేదు.

చిన్నప్పటి నుండి నేను ఎవరిని ఏది అడగలేదు.ఇప్పుడు కూడా నేను ఏది అడగను.

ఒకవేళ జగన్‌ గారు పిలిచి ఏదైనా పదవి ఇస్తే మాత్రం తప్పకుండా స్వీకరించి నా వంతు ఆ పదవికి న్యాయం చేస్తానన్నాడు.

"""/"/ పోసాని కృష్ణ మురళి వాయిస్‌లో మార్పు రావడంకు కారణం ఇటీవలే పృథ్వీ మరియు అలీలకు నామినేటెడ్‌ పదవులు దక్కాయి.

అందుకే ఈయన కూడా ఏదో ఒక పదవి ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.వారిద్దరి కంటే జగన్‌కు సన్నిహితుడు ఈయనే.

ఇద్దరి కంటే ముందు నుండే వైకాపాలో ఉన్నాడు.వారిద్దరి కంటే ఎక్కువగా వైకాపా తరపున ఈయన ప్రచారం చేయడం జరిగింది.

అందుకే ఇద్దరి కంటే నాకే ఎక్కువ అర్హత ఉందని, అందుకే పదవి తీసుకుంటాననే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

మరి జగన్‌ పిలిచి ఈయనకు ఏ పదవి ఇస్తాడో చూడాలి.

ప్రచారంలో స్పీడ్ పెంచిన ఏపీ సీఎం జగన్..!!