అప్పుడు పవన్ డేట్స్ కోసం 30 కోట్లయినా ఇస్తా అన్నాడు.. కానీ ఇప్పుడు...

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తెలుగు ప్రముఖ నటుడు మరియు దర్శకుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇందులో భాగంగా హీరోయిన్ కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఓ యువతిని తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఆమెను శారీరకంగా ఉపయోగించుకుని గర్భవతిని చేసి చివరికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి చేయించాడని దాంతో యువతి సహాయం కోసం సినీ ప్రముఖుల వద్ద పెద్దగా ఉపయోగం లేకపోయిందని కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ ని కోరాడు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ విషయంపై కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దీంతో కొందరు నెటిజన్లు పోసాని కృష్ణమురళి అప్పట్లో యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తాను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా డేట్ల కోసం చూస్తున్నానని అలాగే పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా తాను 40 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అని అప్పట్లో పవన్ కళ్యాణ్ గురించి కొంతమేర పాజిటివ్ గా కామెంట్ చేశాడు.

దీంతో అప్పట్లో పోసాని కృష్ణ మురళి క్రేజీ ఉన్నటువంటి హీరోకి 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా వెచ్చించడానికి సిద్ధమయ్యాడని మరి ఇప్పుడు మళ్లీ తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తా సినిమాలు చేస్తారా.

? అని అడగడం కక్ష సాధింపు చర్యల్లో భాగం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

"""/"/ అయితే ఏదేమైనప్పటికీ ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కొంతమంది రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా తన సినీ జీవితం పై దెబ్బ తీసేందుకు పరోక్షంగా పన్నాగాలు పన్నుతున్నారని కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో కొందరు సినీ సెలబ్రిటీలు మాత్రం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ పై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరి కాదని కూడా అంటున్నారు.

దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి.

మహేష్ నా చిన్న తమ్ముడు… పవన్ అందుకే మా ఇంటికి వచ్చేవాడు: వెంకటేష్