పెరుగుతున్న విదేశీ వలసలు.. ఇమ్మిగ్రేషన్‌లో మార్పులు తీసుకొచ్చిన పోర్చుగల్
TeluguStop.com
పోర్చుగల్ ప్రభుత్వం( Portugal ) తన ఇమ్మిగ్రేషన్ విధానాల్లో గణనీయమైన సంస్కరణలను తీసుకొచ్చింది.
కొత్త నిబంధనల ప్రకారం, కొందరు విదేశీయులు పోర్చుగల్‌కు రాకముందే వర్క్ వీసాను పొందాల్సి ఉంటుంది.
పర్యాటక వీసా కింద పోర్చుగల్‌లో ప్రవేశించి , ఉపాధిని పొందిన తర్వాత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రెసిడెన్సీ మంత్రి ఆంటోనియో లీటావో అమరో( António Leitão Amaro ) మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో నియంత్రిత ఇమ్మిగ్రేషన్ ఆవశ్యకతను నొక్కిచెప్పారు.సరైన పర్యవేక్షణ లేని నియమాలు .
వలసదారులకు అనిశ్చితి, సవాల్ విసిరే పరిస్ధితులకు దారి తీస్తాయని లీటావో పేర్కొన్నారు. """/" /
పోర్చుగల్‌లో విదేశీ వలసదారుల సంఖ్య పెరుగుదలకు ప్రతిస్పందనగా ఈ విధానంలో మార్పు వచ్చింది.
ప్రభుత్వ డేటా 2023లో 33 శాతం పెరుగుదలను వెల్లడిస్తుంది.విదేశీ జనాభా రికార్డు స్థాయిలో ఒక మిలియన్‌కు చేరుకుంది.
దేశం మొత్తం జనాభాలో 10 శాతం మంది ఉన్నారు.ఈ క్రమంలోనే పోర్చుగీసు ప్రభుత్వం అప్రమత్తమైంది.
పోర్చుగీస్ మాట్లాడే దేశాలు, విద్యార్ధులు, అధిక నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం కొత్త వీసా విధానాలు రూపొందించాలని యోచిస్తోంది.
అయితే భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చినవారు ఈ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారని భావిస్తున్నారు.
పెండింగ్‌లో ఉన్న 4,00,000 వీసాల క్రమబద్దీకరణ ప్రక్రియలను పరిష్కరించడానికి, ప్రభుత్వం మరింత మంది సిబ్బందిని నియమించి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది.
"""/" /
పలు కారణాలు చేత పోర్చుగల్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది.ఇతర పాశ్చాత్య ఐరోపా దేశాలతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, అధిక జీవన నాణ్యత ఇందుకు కారణం.
తేలికపాటి శీతాకాలం, అత్యల్ప ఉష్ణోగ్రతలతో ఆహ్లాదకరమైన వాతావరణం పోర్చుగల్ సొంతం.ఏడాది పొడవునా సౌకర్యవంతమైన సౌకర్యవంతమైన జీవనాన్ని కోరుకునేవారికి ఇది అనువైన ప్రదేశం.
సుందరమైన తీర ప్రాంతం, సహజమైన బీచ్‌లు, రోలింగ్ వైన్‌యార్డ్‌లు, చారిత్రక నగరాలు ప్రకృతి సౌందర్యాన్ని కలిగి వున్నాయి.
లిస్బన్ , పోర్టో వంటి నగరాలు ఆధునిక, కాస్మోపాలిటన్ కల్చర్‌కు కేంద్రంగా ఉన్నాయి.
పోర్చుగల్ పట్ల విదేశీయులు ఆకర్షితమవ్వడానికి మరో ముఖ్య కారణం సమర్ధవంతమైన ఆరోగ్య సంరక్షణ, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య.
ఇవి కుటుంబాలు, వ్యక్తులు జీవించడానికి , పనిచేయడానికి స్థిరమైన , సుంపన్నమైన వాతావరణం కోసం శోధించేవారికి గమ్యస్థానంగా మారింది.
అక్కినేని ఫ్యామిలీ హీరోలకు 2025 కలిసి వస్తుందా..?