ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
TeluguStop.com
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర వహించారు.తన పాటలతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ ఊపిరి పోశారు.
గద్దర్ అసలు పేరు విఠల్ రావు కాగా 1949 లో మెదక్ జిల్లా తూఫ్రాన్ లో జన్మించారు.
గద్దర్ మరణవార్తను ఆయన కొడుకు సూర్యం ధృవీకరించారని తెలుస్తోంది.
ఎగ్ బిర్యానీ తింటూ.. తిరుమల పవిత్రతను మంటగలిపిన భక్తులు.. పోలీసుల రియాక్షన్ చూస్తే!