ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‎కు గాయాలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‎ గాయాలపాలయ్యారు.హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ‘ప్రాజెక్ట్ కే’ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు.

అమితాబ్ పక్కటెముకలకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.వెంటనే చిత్ర యూనిట్ ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహించారు.

చికిత్స అనంతరం ఆయన ముంబై తన నివాసానికి వెళ్లిపోయారు.ఈ క్రమంలోనే అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.

చరణ్ గేమ్ ఛేంజర్ రికార్డులు, విశేషాలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?