ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్..!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.తన పేరును, స్వరాన్ని, ఫొటోలను తన అనుమతి లేకుండా కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో నకిలీ లాటరీ స్కామ్, మరే ఇతర సంస్థ వాడుకోకుండా నిరోధించాలని పిటిషన్ దాఖలు చేశారు.

అదేవిధంగా తన ప్రచార హక్కులను కాపాడాలని పిటిషన్ లో కోరారు.ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం అమితాబ్ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

మహేశ్ బాబు మూవీ కోసం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!