దేవుడా.. పూరీలోకి బిర్యాని తినడం ఎప్పుడైనా ట్రై చేసారా..?
TeluguStop.com
నూనెలో వేయగానే బుస్ బుస్ మంటూ పైకి పొంగే పూరీలు అంటే ఎవరైనా ఇష్ట పడతారు.
అయితే పూరీ ఎంత బాగున్నాగాని పూరీలోకి సరిపడా కూర ఉంటేనే పూరీ రుచిని పూర్తిగా ఆస్వాదించగలము కదా.
సాధరణంగా పూరిలో కూర అంటే అందరికి టక్కున గుర్తుకు వచ్చేది ఆలూ కూర.
లేదంటే శనగపిండి ఉల్లిపాయ కూర.ఇలా ఏదన్నా మంచి టేస్టీ కూర ఉంటే ఎన్ని పూరీలు అన్నా ఇట్టే తినేయొచ్చు.
అయితే ఈ కాలంలో రకరకాల వెరైటీ కాంబినేషన్ రెసిపీలను మనం చూస్తూనే ఉన్నాము.
ఈ క్రమంలో మన హస్తినలో మాత్రం ఒక నయా ట్రెండ్ కొనసాగుతుంది.ఈ రకమైన కాంబినేషన్ ను మీరు ఎక్కడా వినడం గాని తినడం గాని చేసి ఉండరు.
అసలు ఇంతకీ ఆ ఫుడ్ కాంబినేషన్ ఏంటో తెలుసా.? పూరీ విత్ వెజ్ బిర్యానీ.
ఏంటి షాక్ అయ్యారా.? ఎవరైనా పూరీలోకి కూర ఇస్తారు.
కానీ ఇలా పూరీలోకి వెజ్ బిర్యానీ ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.?
అసలు వివరాల్లోకి వెళితే.
ఇప్పుడు హస్తినలోని రోడ్లమీద ఆహారం అమ్ముకునే లాల్‌భాయ్ అనే వ్యక్తి పూరీలోకి వెజ్ బిర్యానీ ఇస్తూ కస్టమర్స్ ను ఆకర్షిస్తున్నాడు.
అయితే ఇక్కడి ప్రజలు కూడా ఈ కాంబినేషన్ ఫుడ్ తినడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో లాల్ భాయ్ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు.నేను నా వ్యాపారం మొదలుపెట్టినప్పుడు అందరిలాగానే పూరీతో పాటు బంగాళాదుంప కూర ఇచ్చేవాడిని.
ఈ క్రమంలో ప్రతి వీధిలోను ఇప్పుడు వెజ్ బిర్యానీ ఫుడ్ కోర్ట్ లు మనకు దర్శనం ఇస్తున్నాయి.
అందుకే నేను కూడా వెజ్ బిర్యానీ అమ్మాలని నిర్ణయించుకుని వెజ్ బిర్యానీ బండి పెట్టాను.
"""/"/
అందరిలా నేను వెజ్ బిర్యానీ చేస్తే కొత్తదనం ఏముంటుంది.అందుకే కాస్త వెరైటీగా ఆలోచించి బిర్యానీలోకి బంగాళదుంప కుర్మాతో పాటు, పూరీలనూ కూడా సర్వ్ చేయడం మొదలుపెట్టాను.
నాకు వచ్చిన ఈ ఆలోచన వలన నా ఫుడ్ బిజినెస్ బాగా సాగుతుంది.
కస్టమర్లు కూడా ఈ కాంబినేషన్ ను బాగా ఇష్టపడి మరి తింటున్నారని చెప్పుకొచ్చాడు.
గతంలో కంటే ఇప్పుడు నా వ్యాపారం మరింత రెట్టింపు అయ్యింది.ఎంతో ఆతృతగా వేడి వేడి బిర్యానీని పూరీతో పాటు తింటున్న ఫుడ్ లవర్స్ ను చూస్తుంటే ఒక్కోసారి నాకు కూడా తినాలనిపిస్తుందని చెప్పుకొచ్చాడు లాల్ భాయ్.
ఇప్పటికే రాజధాని విధుల్లో ఈ కాంబినేషన్ బాగా ఫేమస్ అయింది.మరి ఈ వెరైటీ కాంబో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఛలో హస్తినా.
మీ జుట్టు పొడుగ్గా పెరగాలా.. అయితే ఈ సీరంను ట్రై చేయండి!