చాలామందికి నిద్ర పట్టకపోవడానికి కారణాలివే..

మనిషి ఆరోగ్యానికి సరైన నిద్ర ఎంతో ముఖ్యం.నిద్రలేమి కారణంగా చాలామంది డిప్రెషన్, అశాంతి, స్థూలకాయానికి గురవుతున్నారు.

కాగా ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో రాత్రి సమయంలో నిద్రలేమికి కారణాలను కనుగొన్నారు.

ఇందుకు ఒత్తిడి, డబ్బు గురించి ఆందోళన, గది ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోవడం తదితర అనేక ప్రధాన అంశాలు ఉన్నాయి.

2000 మందిపై చేసిన ఒక అధ్యయనం ప్రకారం, 38 శాతం మంది ప్రజలు అసౌకర్యంగా ఉన్న పరుపు కారణంగా తగినంత నిద్ర పొందలేకపోతున్నారు.

అయితే 36 శాతం మంది తమ భాగస్వామి గురక కారణంగా నిద్రకు దూరమవుతున్నారు.

ట్రాఫిక్ శబ్ధాలు, లైట్లు, కెఫిన్ కలిపిన పానీయాలు తాగడం తదితర అలవాట్లు కూడా వ్యక్తిని నిద్రపోనీయకుండా చేస్తాయి.

ఫర్నిచర్ రిటైలర్ డీఎఫ్ఎస్ నిర్వహించిన పరిశోధన ప్రకారం, ఈ విధంగా నిద్ర చెడిపోయినప్పుడు నాలుగు అదనపు నిద్ర అవసరమని నిపుణులు తెలిపారు.

ఈ అధ్యయనంలో రాత్రిపూట మన నిద్రకు భంగం కలిగించే అన్ని కారణాలను పరిశీలించారు.

వీటిలో ఒత్తిడి, ఉష్ణోగ్రత, సౌకర్యవంతమైన మంచం లేదా దిండు, డబ్బు ఆందోళనలు, వెలుతురు, కెఫిన్ కలిగిన పానీయాలు, ట్రాఫిక్ శబ్దంతో సహా కార్యాలయంలో ఆందోళన, మద్యం సేవించడం, మొబైల్ ఫోన్‌ల వినియోగం నిద్రవేళకు కొద్దిసేపటి ముందు రాత్రి భోజనం చేయడం వంటివి కారణాలుగా తేలాయి.

28 శాతం మంది ప్రస్తుతం సాయంత్రం వేళల్లో విశ్రాంతి కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారని చెప్పారు.

ఇంటి నుండి పని చేయడం వల్ల నిద్ర వస్తున్నదని 27 శాతం మంది తెలిపారు.

మేము ఆర్భకులం కాదు అర్జునులం .. కేసిఆర్ కు కోమటిరెడ్డి కౌంటర్