పవన్, అంబటి వివాదంపై పూనమ్ సెటైర్స్.. ట్రోల్స్ తో ఆడేసుకుంటున్న ఫ్యాన్స్!

మామ అల్లుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ ''బ్రో ది అవతార్''.

( Bro The Avatar ) వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

అయితే ఓపెనింగ్స్ అద్భుతంగా రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత తేలిపోయింది.రోజురోజుకూ కలెక్షన్స్ భారీగా తగ్గుతూ వస్తున్న ఈ సినిమా విషయంలో అంబటి రాంబాబు( Ambati Rambabu ) సీరియస్ గా ఉన్నారు.

అందుకు కారణం ఈ సినిమా చూసిన వారికీ తెలిసే ఉంటుంది.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ సినిమాలో అంబటి రాంబాబు క్యారెక్టర్ ను పృథ్వీ తో కావాలని చేయించారని ఆయన ఆరోపించారు.

అలాగే నిర్మాత ఈ సినిమాను బ్లాక్ మనీతో తీసారని పవన్ కు ఇచ్చిన పారితోషికం అంత కూడా ఈ సినిమా కలెక్షన్స్ రాలేదని అంతా ఆయన సెటైర్స్ వేయగా విశ్వప్రసాద్ కూడా ఈయన వ్యాఖ్యలకు స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

"""/" / ఇలా బ్రో సినిమాతో పవన్ వర్సెస్ అంబటి లా సిచ్యువేషన్ మారిపోవడంతో బ్రో సినిమా వార్తల్లో నిలుస్తుంది.

ఇక బ్రో కలెక్షన్స్ పెరగడానికి కారణం కూడా ఈ వివాదం అంటున్నారు.ఇదిలా ఉండగా వీరి మధ్యలోకి నేనున్నా అంటూ దూరింది హీరోయిన్ పూనమ్ కౌర్.

( Poonam Kaur ) ఈ భామ ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేద్దామని ఎదురు చూస్తుంది అనే విషయం అందరికి తెలుసు.

"""/" / అయితే ఈసారి ఈమె ఎవరి పేరు ట్యాగ్ చేయకుండా ట్వీట్ చేసిన ఇది పవన్, అంబటి వివాదంపై అని అందరికి అర్ధం అయ్యింది.

ఈమె ట్వీట్ చేస్తూ ''రాజకీయాలు ఎంటర్టెయిన్మెంట్ చుట్టూ తిరుగుతుంటే.ఎంటర్టెయిన్మెంట్ రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నాయంటూ'' ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ తో ఈమె మరోసారి పవన్ పై సెటైర్స్ వేయడంతో ఫ్యాన్స్ ఈ భామను ఆడేసుకుంటున్నారు.

వైరల్.. ఎలా వస్తాయి అయ్యా ఇలాంటి ఆలోచనలు.. సరికొత్తగా పెళ్లి కార్డు..