సమంత ఆరోగ్య చిట్కాలపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు.. అలా అనేసిందేంటీ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సమంత( Samantha ) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈమె ఇప్పుడిప్పుడే ఈ సమస్యల నుంచి బయటపడటంతో తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.

పలు సినిమాలకు కమిట్ అవుతూ షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సమంత తన హెల్త్ గురించి ఆమె తీసుకుంటున్న చికిత్స గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు అయితే ఇటీవల ఈమె తన హెల్త్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదంగా మారాయి.

"""/" / హైడ్రోజన్ పైరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై సామ్ సూచించిన చిట్కాపై డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇలా ఎంతోమంది సమంత చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే  గుత్తా జ్వాల( Guttha Jwala ) కూడా సమంత చేసిన పోస్ట్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనాలకు హెల్త్ టిప్స్ ( Health Tips ) ఇస్తున్న సెలబ్రిటీలను నేను ఒకటే మాట అడుగుతున్నాను.

మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా చనిపోతే పరిస్థితేంటి? ఎదుటివారికి సాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే.

కాదనను.కానీ జరగరానిది జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? అంటూ ఈమె ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

"""/" / ఇక ఈ ట్వీట్ పట్ల నటి పూనమ్ కౌర్ ( Poonam Kaur ) సైతం స్పందిస్తూ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.

ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాలా, దేన్ని అయినా అడ్వర్టైజ్ చేసేయొచ్చు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ చాలామంది సెలబ్రిటీలు చక్కెర తీసుకోరు కానీ వాళ్లు మాత్రం చక్కెర ఉన్నటువంటి పదార్థాలు అనగా చాక్లెట్లు ఇతర పానీయాలను విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తూ ఉంటారు  ఇదంతా కేవలం డార్క్  రియాలిటీ అంటూ సమంత ఆరోగ్య చిట్కాలపై పూనమ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సిటాడెల్ లో లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయిన సమంత.. మళ్లీ రచ్చ మొదలైందిగా!