ఏపీ ఎన్నికల ఫలితాల గురించి సెటైరికల్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్.. ఏమైందంటే?

తెలుగు ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్( Poonam Kaur) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఒకప్పుడు ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

ఆ తర్వాత ఈమె రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుందని చెప్పవచ్చు.

కాగా ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలు కంటే ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాల్లోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

"""/" / తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో, సినిమాలకి సంబందించిన విషయాల్లో తలదూరుస్తూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా ట్వీట్స్ చేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్( Poonam Kaur).

తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.ఆ వివరాల్లోకి వెళితే.

నటి పూనమ్‌ కౌర్‌ ఏపీ ఎన్నికల ఫలితాలపై (AP Lection Results) స్పందించింది.

ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏపీ ఫలితాలపై స్టోరీ పోస్ట్‌ షేర్‌ చేస్తూ.

"""/" / వై నాట్ 175 అనే విషయాన్ని ఏపీ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు అంటూ ఆమె కామెంట్ చేసింది.

అయితే ఇది ఎవరిని ఉద్దేశించి చేసిందా? అని నెటిజన్లు డైలామాలో ఉన్నారు.ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan Kalyan) ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

పిఠాపురం నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన వైసీపీ(YCP) అభ్యర్థి వంగా గీతాపై 69వేల ఓట్ల మేజారితో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

వీడియో వైరల్‌.. చెత్త లారీతో డోనాల్డ్ ట్రంప్‌