జై బాలయ్య అంటూ రియాక్ట్ అయిన పూనమ్.. త్రివిక్రమ్ కు మాత్రం మరో షాకిచ్చిందిగా!
TeluguStop.com
నందమూరి నట సింహం బాలకృష్ణకు(Balakrishna ) ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్(Padma Bushan) అవార్డును ప్రకటించిన విషయం తెలిసినదే.
ఇలా సినిమా ఇండస్ట్రీలో ఈయన అందించిన సేవలకు గాను తనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.
ఇక బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలందరూ కూడా బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే సంచలన నటి పూనమ్ కౌర్(Poonam Kaur) బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ శుభకాంక్షలు తెలిపారు.
"""/" /
నటి పూనం కౌర్ కూడా జై బాలయ్య అంటూ బాలకృష్ణకు(Balakrishna) శుభాకాంక్షలు తెలిపారు.
ఇక్కడ వరకు అంతా బానే ఉంది.అయితే ఈమె చేస్తున్న ఈ పోస్ట్ పై కొంతమంది నెటిజెన్లు స్పందిస్తూ కామెంట్లు చేస్తూ రిప్లై ఇచ్చారు.
ఇలా అంతా బానే ఉన్న నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మరోసారి ఈమె మాట్లాడుతూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
ఈమె బాలకృష్ణకు అభినందనలు తెలియజేస్తూ పోస్ట్ చేయడంతో ఒక నెటిజన్ ఈమె పోస్టుకు కామెంట్ చేస్తూ.
మీరు బ్రతకడం కోసం ఏం చేస్తారు అంటూ ప్రశ్నించారు. """/" /
ఈ ప్రశ్నకు పూనమ్ కౌర్ సమాధానం చెబుతూ.
పనిచేసే దానిని కానీ త్రివిక్రమ్ అతని గ్రూప్ టార్చర్ కారణంగా అన్ని ఆగిపోయాయి అంటూ ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఇలాంటి పోస్ట్ చేయడంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇక ఇటీవల కాలంలో పూనమ్ ఏం మాట్లాడినా అది త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas )కి లింక్ పెడుతూ విమర్శలు చేస్తూ ఉంటారు.
గతంలో గురూజీ అంటూ పరోక్షంగా ఆయన గురించి పోస్టులు చేసే ఈమె ప్రస్తుతం మాత్రం త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణంగానే తన కెరీర్ మొత్తం నాశనమైంది అంటూ ఎన్నో సందర్భాలలో ఈమె దర్శకుడి పై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.
అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్.. ఆ తప్పులు చేయనంటూ?