బాలయ్య చిన్నల్లుడి పై పూనమ్ షాకింగ్ కామెంట్స్.. రాష్ట్రానికి పరిమితి కాకూడదంటూ?
TeluguStop.com
ఏపీలో మరొక ఏడు రోజులలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఇలాంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అయితే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) ఏపీ రాజకీయాల( Ap Politics ) గురించి పరోక్షంగా పోస్టులు చేస్తూ ఉన్న సంగతి మనకు తెలిసినదే .
గత కొంతకాలంగా పరోక్షంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని టార్గెట్ చేస్తూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
"""/" /
తాజాగా పూనమ్ బాలయ్య చిన్న అల్లుడు భరత్( Bharath ) గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .
భరత్ గత ఎన్నికలలో భాగంగా వైజాగ్( Vizag ) పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే గత ఎన్నికలలో ఈయన ఓటమి పాలయ్యారు.ఈ విధంగా భరత్ ఓడిపోవడంతో ఈసారి కూడా ఈయన వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నారు.
అయితే ఈసారి మాత్రం ఈయన గెలిచే దాఖలాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి ఇదే విషయం గురించి నటి పూనమ్ కామెంట్లు చేశారు.
"""/" /
ఈ సందర్భంగా పూనమ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియో చూస్తుంటే ఈ ఎన్నికల్లో శ్రీ భరత్ ఏదో సాధించేలా కనిపిస్తున్నాడని పూనమ్ కౌర్ పేర్కొన్నారు.
భరత్ వైజాగ్ ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపారు.
చదువు గురించి భవిష్యత్తు గురించి భరత్ కి ఉన్నటువంటి అవగాహన కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకూడదు అంటూ ఈమె ఆయన గురించి గొప్పగా చెబుతూ చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇక బాలయ్య( Balayya ) చిన్న కుమార్తె తేజస్విని భరత్ కి ఇచ్చే వివాహం చేశారు.
ఇక ఈయన గీతం విద్యాసంస్థలకు అధినేత అనే సంగతి మనకు తెలిసిందే.
బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా కుర్రాడిపై కాలు దువ్విన కోహ్లీ.. (వీడియో)