మరోమారు త్రివిక్రమ్ పరువు తీసిన పూనమ్ కౌర్.. త్రివిక్రమ్ డైలాగ్స్ అలా ఉంటాయంటూ?

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈరోజు సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) పేరు గట్టిగానే వినిపిస్తున్న విషయం తెలిసిందే.

అందుకు గల కారణం కూడా లేకపోలేదు.ప్రణీత హనుమంతు అనే ఒక యూట్యూబర్ అంతు చూసే వరకు కూడా విడిచి పెట్టలేదు.

సాయి తేజ్ ట్వీట్ల మీద ట్వీట్లు చేసి తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, మహిళా కమిషన్ డిజిపి ఇలా ప్రతి ఒక్కరు స్పందించే వరకు ఆ విషయాన్ని పెట్టలేదు.

అలా ఎట్టకేలకు అనుకున్నది సాధించి అతనికి గట్టిగా బుద్ధి చెప్పడంతో సాయి ధరంతేజ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

"""/" / అయితే కొందరు సాయి ధరంతేజ్ ని రియల్ హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తుండగా మరికొందరు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక నిటిజన్ చేసిన నెగిటివ్ కామెంట్ కి నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) రిప్లై ఇస్తూ కౌంటర్ వేసింది.

ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) పై సెటైర్లు కూడా వేసింది.

రేప్ అనే విషయం మీద తేజ్ స్పందించిన తీరుకు జల్సా సినిమాలోని ఒక సీన్‌ను చూపించాడు సదరు నెటిజన్.

పడుకుని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తది అంటూ బ్రహ్మానందంతో పవన్ చెప్పే డైలాగ్‌ను చూపించి ఇలాంటి వాటి వల్లే యూత్ చెడిపోతోందని, ముందు వీళ్ల మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ కౌంటర్ వేశాడు.

అయితే సదరు నెటిజన్ చేసిన ట్వీట్ పై పూనం స్పందిస్తూ. """/" / రాసింది త్రివిక్రమ్ అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు అంత కంటే ఎక్కువగా ఆశించొద్దు అని కౌంటర్ వేసింది.

పూనమ్ వేసిన ట్వీట్ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.అసలు జరిగిన మ్యాటర్ ఏంటి? ఆ గొడవ ఏంటి? త్రివిక్రమ్‌ తో మీకున్న సమస్య ఏంటి? అని నెటిజన్లు అడుగుతున్నారు.

కానీ పూనమ్ మాత్రం ఇంత వరకు జరిగిన విషయాన్ని నేరుగా చెప్పలేదు.అయితే ఈ మధ్యకాలంలో సందు దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ప్రత్యక్షంగా పరోక్షంగా కౌంటర్లు చేస్తూ వస్తోంది పూనమ్ కౌర్.

వైఫ్ కోసమే డైలీ 320 కి.మీ ప్రయాణిస్తున్న చైనీస్ వ్యక్తి..!