ధనుష్ నయనతార వివాదంలో త్రివిక్రమ్.. పూనమ్ కౌర్ పోస్ట్ చూస్తే షాకవ్వాల్సిందే!

హీరోయిన్ పూనమ్ కౌర్( Poonam Kaur ) గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు హీరోయిన్గా కలిసి సినిమాలలో నటించి మంచి పాపులారీటి తెచ్చుకున్న ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా గుర్తింపు తెచ్చుకుందని చెప్పాలి.

తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రవర్సీ ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

జనం తనని మర్చిపోకూడదని అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో తన విశ్వరూపం చూపిస్తూ ఉంటుంది.

సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా తను మాత్రం ఏదో ఒకరకంగా స్పందిస్తూ లేనిపోని కాంట్రవర్సీలు కొని తెచ్చుకుంటూ ఉంటుంది.

"""/" / ముఖ్యంగా సందర్భం ఏదైనా సరే ఆమె ఎక్కువగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని( Trivikram Srinivas ) టార్గెట్ చేస్తూనే ట్వీట్లు చేస్తూ ఉంటుంది.

ఆమె అంతేకాకుండా టార్గెట్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ అని చాలా సందర్భాల్లో ప్రూవ్‌ అయింది.

వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని అందరికీ అనిపించినా అదేమిటో ఎవ్వరికీ తెలీదు.కానీ, వీలున్నప్పుడల్లా త్రివిక్రమ్‌పై విరుచుకుపడడం పూనమ్‌ కౌర్‌కి అలవాటుగా మారిపోయినట్టుంది.

తాజాగా ఒక వివాదం వల్ల త్రివిక్రమ్‌ పై మరోసారి కామెంట్‌ చేసింది పూనమ్‌ కౌర్‌.

తన మ్యారేజ్‌ డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నయనతార( Nayanthara ) నేనూ రౌడీనే చిత్రంలోని క్లిప్పింగ్స్‌ ఇవ్వమని రిక్వెస్ట్‌ చేసింది.

"""/" / అతను ఇవ్వకపోవడంతో తన దగ్గర ఉన్న కెమెరాతో తీసిన బిహైండ్‌ సీన్స్‌ లోని క్లిప్పింగ్‌ ను ఆ డాక్యుమెంటరీ కోసం వాడారు.

దీనిపై స్పందించిన ధనుష్‌( Dhanush ) క్లిపింగ్స్‌ వాడినందుకు తనకు రూ.10 కోట్లు చెల్లించాలని కోర్టు నోటీసు పంపాడు.

దానికి సమాధానంగా ఒక బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు నయనతార.వీరి వ్యవహారంలో నయనతారను ఎంతో మంది నటీమణులు సపోర్ట్‌ చేస్తున్నారు.

వారితో పూనమ్‌ కౌర్‌ కూడా చేరింది.ఆమెకు తన మద్దతను ప్రకటించింది.

తనకు తోచిన విధంగా ధనుష్‌పై ఆరోపణలు చేసింది.పూనమ్‌ వైఖరిపై స్పందించిన ఒక నెటిజన్‌.

నయనతార తన వ్యక్తిగత జీవిత డాక్యుమెంటరీని అమ్మి డబ్బు సంపాదిస్తున్నప్పుడు ధనుష్‌ కాపీరైట్‌ మొత్తాన్ని అడగడంలో తప్పు ఏమిటి? అని ప్రశ్నించాడు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇతర సినిమాల్లోని సన్నివేశాలను కాపీ కొట్టిన సందర్భాలు ఉన్నాయి.వాటిని ఏమంటారు? అంటూ ఎదురు ప్రశ్నించింది.

ధనుష్‌, నయనతార వివాదంలో త్రివిక్రమ్‌కి సంబంధం లేకపోయినా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ అతన్ని కూడా ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తోంది పూనమ్‌ కౌర్‌.

Méthodes De Paiement Et Gestion De Bankroll Pour Les Joueurs Français