హీరోల ఫ్యాన్స్ అమాయకులు అంటున్న పూనమ్ కౌర్
TeluguStop.com

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీరా చోప్రా మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది.


తాను ఎన్టీఆర్ అభిమానిని కాదు అన్నందుకు ఎన్టీఆర్ అభిమానులు ఆమెపై అసభ్య పదజాలంతో దూషించడం మొదలెట్టారు.


చెప్పలేని స్థాయిలో బూతులు ఉపయోగించి ట్రోల్ చేశారు.కొంత మంది మరింత శృతి మించి ప్రవర్తించారు.
ఈ ఘటనలపై మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది.ఇక ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి పెట్టారు.
ఆమెపై కామెంట్స్ చేసిన వారు ఎవరనే విషయంపై విచారణ మొదలెట్టారు.ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఇప్పుడు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఫ్యాన్స్ ను నిందించడంలో అర్థం లేదని, వారు నిజంగా చాలా అమాయకులని వ్యాఖ్యానించారు.
మధ్యలో ఉన్న వాళ్లే ఇలాంటి ఘటనలకు కారకులని, ఏవో ప్రయోజనాలు ఆశించి ఇలా ఫ్యాన్స్ ముసుగులో ఎటాక్ చేస్తారని పేర్కొన్నారు.
అనేక పర్యాయాలు అకారణంగా తనను కూడా వివాదాల్లోకి లాగినా, ఇప్పటివరకు ఒక్క సంఘటనలోనూ ఫ్యాన్స్ పై ఫిర్యాదు చేయలేదని పూనమ్ కౌర్ వెల్లడించారు.
నన్ను ఇబ్బందులకు గురిచేసిన వాళ్లపైనే ఫిర్యాదు చేశాను తప్ప, అభిమానులపై ఫిర్యాదు చేయలేదని వివరించారు.
ఇబ్బందులకి గురిచేసిన వారు అందరూ నిజమైన ఫ్యాన్స్ కాదని కామెంట్స్ చేసింది.
ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం దక్కలేదు.. సృష్టి డాంగే సంచలన వ్యాఖ్యలు వైరల్!