ప్రతి పొలిటీషియన్ లీడర్ కాలేరు..పూనమ్ పొలిటికల్ పంచ్ పవన్ కేనా?

పూనమ్ కౌర్ ( Poonam Kaur ) ఇటీవల కాలంలో సోషల్ మీడియా పోస్టుల ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.

ఈమె సినిమాలలో సాధించిన సక్సెస్ కంటే ఇలా సోషల్ మీడియా ద్వారా వివాదాస్పద పోస్టులు పెడుతూ వార్తలలో నిలుస్తూ ఉన్నారు.

ఇక సినిమాకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ఈమె పోస్టులు చేస్తూ ఉంటారు.

అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారన్నది మాత్రం తెలియక నేటిజన్స్ తలలు పీక్కుంటూ ఉంటారు.

"""/" / ఇకపోతే ఇటీవల జల్సా సినిమాలో ఒక డైలాగ్ గురించి ఈమె మాట్లాడుతూ ఆ డైలాగ్ చెప్పినది పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అయినప్పటికీ రాసినది మాత్రం త్రివిక్రమ్ ( Trivikram ) అంటూ సంచలనమైన పోస్ట్ చేశారు.

ఇక ఈ విషయం మర్చిపోకముందే మరోసారి పొలిటికల్ పంచ్ ఇస్తూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పూనమ్ స్పందిస్తూ.ఒక నాయకుడు మహిళలకు ఇచ్చే గౌరవం చూసి తన ఫాలోవర్స్ కూడా మహిళలకు గౌరవం ఇచ్చేలాగా ఉండాలి.

ఒక లీడర్ అంటే బాధ్యత మోసేవాడు కాదు తనని తాను గొప్పగా ఉన్నతంగా చూపించు కొనేవాడు కాదు.

ప్రతి రాజకీయ నాయకుడు గొప్ప లీడర్ కాలేరు అంటూ ఈమె పోస్ట్ చేశారు.

"""/" / ఇక ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో తెలియదు కానీ ఈ పోస్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.

ఈ క్రమంలోనే ఓ అభిమాని ఈ పోస్టుపై మండిపడ్డారు.నీకు ప్రస్తుతం ఎలాంటి సినిమాలు సీరియల్స్ లేవు ఎలాంటి పని పాట లేకుండా ఇతరులపై ఏడుస్తూ ఉంటావు.

  ఇలాంటి ఒక లేజీ ఇడియట్స్ ని ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టాలి అంటూ పోస్ట్ చేశారు.

ఇలా నెటిజన్ చేసిన పోస్ట్ పై కూడా ఈమె వెంటనే రియాక్ట్ అవుతూ గురూజీ టాలెంట్‌ను తొక్కేస్తాడు.

ఎస్కార్ట్స్‌ని ఎంకరేజ్ చేస్తుంటాడు.గురూజీకి కావాల్సిన కారెక్టర్ లేదా టాలెంట్ నా దగ్గర లేదు అని రిప్లై ఇచ్చింది .

అయితే ఈ పోస్ట్ చేసిన కొంతసేపటికి డిలీట్ చేయడంతో ఈమె తప్పకుండా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారని పలువురు భావిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఆరోగ్యానికి వరం నల్ల నువ్వులు.. రోజు ఇలా తీసుకుంటే అదిరిపోయే లాభాలు!