తెలుగు దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో నటి పూనమ్ బజ్వా
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పూనం బజ్వా.
నాగార్జున సినిమా బాస్ లో ఈమె నటనకు గాని మంచి మార్కులే పడ్డాయి.
2005లో మిస్ పూణే గా సెలెక్ట్ కావడంతో పూనం బజ్వా కి మోడలింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది.
వాస్తవానికి ఈమె పక్క పంజాబీ అయిన ముంబైలో పుట్టింది.చిన్న వయసులోనే ఆమె ర్యాంప్ షోలతో, ర్యాంప్ వాక్ లు చేస్తూ మోడలింగ్ లో బాగానే అవకాశాలు సంపాదించింది.
ఒకసారి హైదరాబాద్ కి రాంప్ షో కోసం పూనం బజ్వా రాగా ఆ టైంలో దర్శకుడు కూచిపూడి వెంకట్ దృష్టి పూనమ్ పై పడింది.
దాంతో అతడు తీస్తున్న మొదటి సినిమా అనే చిత్రానికి ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.
ఆమెకు సైతం కాలేజీ పూర్తయి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఒక నాలుగు నెలల సమయం ఉండడంతో మొదటి సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పింది.
అలా తెలుగులో నవదీప్ సరసన పూనం తొలిసారి హీరోయిన్ గా నటించింది.ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ఇంగ్లీషు లిటరేచర్ డిగ్రీ పట్టా పొందింది.
ఇక పూనమ్ రెండవ సినిమా కూడా నవదీప్ తోనే కావడం విశేషం.ప్రేమంటే ఇంతే సినిమాలో ఇది ఇద్దరు కలిసి మరోమారు నటించారు.
ఆ తర్వాత బాస్ సినిమాలో నాగార్జున నయనతార మెయిన్ లీడ్ లో నటించగా పూనమ్ సెకండ్ హీరోయిన్ గా నటించింది.
సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి మూలం 30 సినిమాల వరకు నటించింది పూనమ్.
"""/"/
అయితే ఆమె కెరియర్ లో పెద్ద హీరోలతో నటించలేదు అలాగే ఒకవేళ పెద్ద హీరోల సినిమాల్లో నటించాల్సిన సెకండ్ హీరోయిన్ గా మాత్రమే అవకాశాలు లభించాయి దాంతో పూనమ్ స్టార్ హీరోయిన్ కాలేదు.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న పూనమ్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.
హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తుంది.ఇక ఇదే టైంలో తెలుగు సినిమా దర్శకుడైన సునీల్ రెడ్డితో ప్రేమలో పడింది పూనమ్.
గత రెండు దశాబ్దాలుగా సునీల్ రెడ్డి చిన్న సినిమాలకు దర్శకుడుగా మంచి పేరును సంపాదించుకున్నాడు.
వీరిద్దరి ప్రేమను సోషల్ మీడియా సాక్షిగా పూనమ్ కన్ఫర్మ్ చేసింది.త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారట.
యూకే యూనివర్సిటీలలో శాలరీలు ఇంత తక్కువా.. ఎన్నారై ప్రొఫెసర్ ఆవేదన!