సన్యాసి గెటప్ లో దర్శనమిచ్చిన హీరోయిన్... ఏమైందంటూ కామెంట్లు...

2005 వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ సీనియర్ దర్శకుడు "కూచిపూడి వెంకట్" దర్శకత్వం వహించిన "మొదటి సినిమా" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ "పూనమ్ బజ్వా" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే వచ్చి రావడంతోనే ఈ అమ్మడు తన అందం, అభినయం, నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

దీంతో పూనమ్ బజ్వా కి టాలీవుడ్ లోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, తదితర భాషలలో సినిమా అవకాశాలు తలుపు తతట్టాయి.

కానీ దురదృష్టవశాత్తు ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

దీంతో ఈ ప్రభావం సినిమా కెరియర్ పై పడింది.ఈ క్రమంలో హీరోయిన్ గా సినీ కెరీర్ ని కోల్పోయింది.

ఆ తరువాత అడపాదడపా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది.

అయితే ఈ మధ్య కాలంలో నటి పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ తన అభిమానులను బాగానే అలరిస్తోంది.

కాగా తాజాగా ఈ అమ్మడు సన్యాసి గెటప్ వేసి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

అంతేకాకుండా ఆ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి అభిమానులు అవాక్కయ్యారు.

అంతేకాకుండా ప్రముఖ యాడ్ షూటింగ్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ లో భాగంగా సన్యాసి గెటప్ లో ఫోటోలు దిగినట్లు పూనమ్ బజ్వా తెలిపింది.

"""/"/ అయితే ఈ మధ్య కాలంలో నటి పూనమ్ బజ్వాకి సినిమా అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి.

దీంతో తన అందాల ఆరబోతతో సినిమా అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అంతేకాకుండా ఆ మధ్య ఒక ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే బోల్డ్ షో చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడనని తెలిపింది.

కాగా ప్రస్తుతం పూనమ్ బజ్వా మలయాళ భాషలో ప్రముఖ దర్శకుడు "వినయన్" దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

మరి ఈ చిత్రం అయినా ఈ అమ్మడికి సినిమా అవకాశాలు తెచ్చి పెడుతుందో లేదో చూడాలి.

ఓజీ సినిమాలో పాట పాడుతునందుకు రమణ గోగుల తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?