దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వమని డబ్బులు ఇచ్చారు….పూల చొక్కా నవీన్ షాకింగ్ కామెంట్స్!

ఇటీవల కాలంలో ఎంత పెద్ద హీరో నటించిన ఎలాంటి సినిమా అయినా కూడా ఆ సినిమాకి వచ్చే పాజిటివ్ రివ్యూ కంటే నెగిటివ్ రివ్యూలు ఎక్కువ అవుతున్నాయి.

కనీసం ఆ సినిమా ఒకరోజు ఆడుకుండానే మొదట షో చూసిన వెంటనే నెగిటివ్ రివ్యూలు ( Negative Review ) రాసే వారి సంఖ్య కూడా అధికమయ్యింది.

ఇలా రివ్యూల కారణంగా ఎంతోమంది నిర్మాతలు నష్టపోవాల్సి వస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇదంతా కూడా ఒక హీరో ఫ్యాన్స్ మరొక హీరో సినిమాని తొక్కేయాలని చేసే ప్రయత్నమే అని స్పష్టమవుతుంది.

మన హీరోనే గొప్ప, మన హీరోల సినిమాలే ఆడలని వేరే నిర్మాతల, హీరోల సినిమాలను చంపేస్తున్నారు.

"""/" / ఇలా చేయడం వల్ల నిర్మాతలకు నష్టాలు తప్పవని చెప్పాలి.అయితే తాజాగా ఇలాంటి కొంతమంది సైకో ఫ్యాన్స్ గురించి వివాదాస్పద రివ్యూవర్ పూల చొక్కా నవీన్( Poolachokka Naveen ) షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల కాలంలో పుచుక్ పుచుక్ పూలచొక్కా అంటూ తన రివ్యూలతో పాపులర్ అయిన పూలచొక్కా నవీన్ దేవర సినిమా( Devara Movie ) గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

దేవర సినిమా విడుదల సమయంలో కొంతమంది నాకు నెగిటివ్ రివ్యూలు రాయాలి అంటూ సంప్రదించారు.

"""/" / ఒక స్టార్ హీరో పీఆర్వో నా దగ్గరకు వచ్చి దేవర సినిమా గురించి నెగిటివ్ రివ్యూ రాస్తే నాకు పదివేల రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు.

అయితే ఆ ఆఫర్ విన్న తర్వాత నేను సినిమా ఎలా ఉంటే అలాగే రివ్యూ ఇస్తానని సినిమా బాగున్న నెగిటివ్ రివ్యూ ఇస్తే కనుక తన క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేశానని నవీన్ చెప్పుకొచ్చాడు.

అతను చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే పిఆర్ఓలు తెర వెనుక తమ హీరోల సినిమాలు సక్సెస్ చేయడం కంటే కూడా ఇతర హీరోల సినిమాలను తొక్కేయడంలోనే బిజీగా ఉన్నారని స్పష్టమవుతుంది.

మరి ఈయనకు డబ్బులు ఆఫర్ చేసిన ఆ హీరో పిఆర్ఓ ఎవరు అనే విషయం బయట పెట్టలేదు కానీ ఈ విషయం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ఐటీ.. తెర వెనుక ఇంత జరిగిందా?