ఒకప్పుడు రిసెప్షనిష్ట్.. ఇప్పుడు ఐపీఎస్.. ఈ యువతి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం కష్టం కాదనే సంగతి తెలిసిందే.

ఒకప్పుడు ట్యూషన్లు చెప్పి, రిసెప్షనిష్ట్ గా పని చేసిన పూజా యాదవ్( Pooja Yadav ) ఐపీఎస్ ఉద్యోగం సాధించి సెల్యూట్ చేయించుకునే స్థాయికి ఎదిగారు.

ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ పూజా యాదవ్ సక్సెస్ అయ్యారు.

హర్యానాకు చెందిన పూజా యాదవ్ ఐపీఎస్( IPS ) కావాలన్న కల నెరవేరడంలో ఎంతో సంతోషిస్తున్నారు.

పూజా యాదవ్ హర్యానాలో బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీలో( Bio Technology, Food Technology In Haryana ) ఎంటెక్ పూర్తి చేశారు.

ఆర్థికంగా ఎంటెక్ పూర్తి చేయడానికి పూజా యాదవ్ ఎంతో కష్టపడ్డారు.బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసిన పూజా యాదవ్ ఏ జాబ్ చేసినా సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఐపీఎస్ కావాలని అనుకున్నారు.

అయితే కుటుంబ ఇబ్బందుల వల్ల ఆమె లక్ష్యాన్ని సాధించే విషయంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి.

"""/" / పూజా యాదవ్ ఎంతో కష్టపడి పరీక్ష రాసినా తొలి ప్రయత్నంలో ఎదురుదెబ్బలే తగిలాయి.

చక్కగా టైమ్ టేబుల్ ను ప్రిపేర్ చేసుకున్న పూజా యాదవ్ తొలి ప్రయత్నంలో తడబడినా రెండో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించారు.

2018 సంవత్సరం నుంచి పూజా యాదవ్ ఐపీఎస్ గా పని చేస్తున్నారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కష్టపడితే సక్సెస్ దక్కుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

"""/" / పూజా యాదవ్ చదువు విషయంలో డబ్బు ఆమెకు పెద్ద సమస్య అయింది.

సివిల్స్ చదవాలంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉండటంతో పూజా యాదవ్ ట్యూషన్లు చెప్పడంతో పాటు రిసెప్షనిష్ట్ గా పని చేశారు.

పేదరికం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న ఎంతోమందికి పూజా యాదవ్ సక్సెస్ స్టోరీ స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.

పూజా యాదవ్ కు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని ఆశిద్దాం.

రెప్పపాటులో 20లక్షలు హుష్‌ కాకి.. వీడియో వైరల్