కెరియర్ కోసం షాకింగ్ డిసిషన్ తీసుకున్న పూజా హెగ్డే… వేణు స్వామిని కలిసిన నటి?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పూజా హెగ్డే (Pooja Hegde) ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ కెరియర్ పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.

ఇలా ఈమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడం లేదా తాను కమిట్ అయిన సినిమాల నుంచి తప్పుకోవడం జరగడంతో ఎంతోమంది అభిమానులు పూజా హెగ్డే కెరియర్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఈమె సినిమాలు ఫ్లాప్ కావడంతో మరోవైపు ఈమెను ఐరన్ లెగ్ (Iron Leg) అంటూ కూడా ఈమెపై భారీ ట్రోల్స్ వస్తున్నాయి.

అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి తాను కూడా ఇండస్ట్రీలో సక్సెస్ కావడం కోసం పూజ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.

"""/" / సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి(Venu Swamy).

ఈయన చెప్పినది చెప్పినట్టుగా జరగడంతో ఈయన మాటలను నమ్మే వారి సంఖ్య అధికమవుతుంది.

ఈ క్రమంలోనే వేణు స్వామి జాతక దోషాలు కనుక ఉంటే పరిహారాలు చేస్తారని కూడా మనకు తెలిసిందే.

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈయన చేత పూజలు కూడా చేయించుకున్నారు.ఇలా జాతకంలో ఉన్నటువంటి దోషాలకు పరిహారం చేయడం వల్ల వారి కెరియర్ ముందుకు సాగుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు.

"""/" / ఈ క్రమంలోనే వరుస ప్లాప్ సినిమాలతో ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి నటి పూజా హెగ్డే కూడా తన కెరియర్ ను ముందుకు కొనసాగించడం కోసం వేణు స్వామిని కలిసారని తెలుస్తోంది.

ఈమె జాతకంలో కూడా ఏవైనా దోషాలు ఉంటే దోషపరిహారం చేయించాలని భావించారట అందుకే వేణు స్వామి అపాయింట్మెంట్ తీసుకుని పూజా కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ దోష పరిహార పూజ చేయించిన అనంతరం ఈమె తిరిగి ఇండస్ట్రీలో మరోసారి తన హవా కొనసాగించడం కన్ఫామ్ అంటూ పలువురు సినీ సెలబ్రిటీలు భావిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అరుపుతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. జక్కన్న కామెంట్స్ వైరల్!