హ్యాట్రిక్ కొట్టిన పూజా.. ఇక ముందుకు వెళ్ళేది కష్టమేనా..
TeluguStop.com
టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో పూజా హెగ్డే ఒకరు.ఈమె ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
పూజా మొదట్లో వరుస ప్లాప్స్ ఎదురవడంతో ఈమెకు అంతా డిమాండ్ లేకపోయింది.అయితే అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఈమెకు స్టార్ డమ్ దక్కింది.
ఈ సినిమా తర్వాత ఈమెను లక్కీ బ్యూటీ గా అభివర్ణిస్తున్నారు.అప్పటి నుండి వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకోవడమే కాకుండా అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు మారుమోగి పోయింది.
అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.గత కొన్ని రోజులుగా ఈమె వరుస ప్లాప్స్ ఎదురు కుంటుంది.
బ్యాచిలర్ సినిమా తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే వస్తున్నాయి.వరుసగా విజయాలు అందుకుని ఎలా పేరు తెచ్చుకుందో.
ఇప్పుడు అలానే వరుస ప్లాప్స్ అందుకుంటుంది.ఈమె నటించిన ప్రభాస్ రాధేశ్యామ్ తో ప్లాప్ ఎదురయ్యింది.
ఈ సినిమా తర్వాత మళ్ళీ విజయ్ దళపతి తో చేసిన బీస్ట్ సినిమా తో మరో ప్లాప్ చవి చూసింది.
ఈ రెండు ప్లాప్స్ తో డీలా పడిన ఈమె ఆచార్య తో తిరిగి కోలుకోవాలని అనుకుంది.
"""/"/
కానీ ఈమె ఆశలపై ఆచార్య కూడా నీళ్లు చల్లేసింది.చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన సినిమాలో పూజా హెగ్డే రామ్ చరణ్ కు జోడీగా నటించింది.
ఈ సినిమా 29న రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ఇలా వరుస ప్లాప్ లతో హ్యాట్రిక్ అందుకున్న ఈ బ్యూటీ రానున్న రోజుల్లో అవకాశం అందుకుంటుందో లేదో.
రెమ్యునరేషన్ కు మాత్రమే విలువ ఇచ్చి పాత్రలను పట్టించుకోక పోతే ముందు ముందు నెగ్గడం చాలా కష్టం.
పుష్ప3 ఐటమ్ సాంగ్ లో ఆ హీరోయిన్ కనిపించనున్నారా.. ఆమె ఓకే అంటారా?