Pooja Hegde : పూజా హెగ్డే 2023 లో వదిలేసుకున్న తెలుగు సినిమాల లిస్ట్ ఇదే !
TeluguStop.com
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ పూజా హెగ్డే '( Pooja Hegde )డీజే’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేశ్’, ‘అల వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది.
అయితే ఇటీవల ఆమె చేసిన ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
దాని తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది.ఈ క్రమంలోనే మహేశ్ బాబు ‘గుంటూరు కారం( Guntur Kaaram )’ నుంచి, ఆపై రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచఆమె తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
కారణాలేవో తెలియవు కానీ గుంటూరు కారం సినిమా షూటింగ్ 40% అయిపోయాక పూజా హెగ్డేని బయటికి పంపించారని సినిమా సర్కిల్లో ప్రచారం జరిగింది.
దానికి కారణం ఆమె సరిగా సినిమా నిర్మాతలతో డీల్ కుదుర్చుకోకపోవడమే అని తెలుస్తోంది.
లేదంటే ఆమె సరిగా ఔట్‌ఫుట్ ఇవ్వలేకపోయిందేమో. """/" / గతంలో మాత్రం బాగానే ఆమె నటించింది కానీ ఇప్పుడు చేతికి అందిన అవకాశాలు కూడా చేయి జారిపోతున్నాయి.
దానివల్ల ఆమె పర్ఫామెన్స్ దారుణంగా పడిపోయిందా లేక రెమ్యునరేషన్ విషయంలో తేడాలు వస్తున్నాయా అనేది చర్చినీయాంశంగా మారిందినిజానికి అల వైకుంఠపురములో సినిమా( Ala Vaikunthapurramuloo )లో పూజా హెగ్డే అందాన్ని పొగుడుతూ రచయితలు పాటలు రాశారు.
బుట్టబొమ్మతో పాటు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ సూపర్ హిట్ అయ్యాయి.
ఆ టైంలో పూజ హెగ్డే యువకులకు డ్రీమ్ గర్ల్ గా కూడా మారింది.
"""/" / అలాంటి స్థాయి నుంచి ఆమె పతనం కావడానికి రాధేశ్యామ్( Radhe Shyam ) మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు.
అలాగే ఆమె హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ అక్కడ కూడా ఆమె నటించిన ఒక్క సినిమా హిట్ కాలేదు.
ఉదాహరణకి 'సర్కస్’, ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి.
ఇక ఇప్పుడు ఈ తారకు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.అయినా రూ.
3.5 కోట్ల పారితోషికం కావాలని నిర్మాతలకు చెబుతోందట.
అంత డబ్బు ఇచ్చుకోలేక నిర్మాతలు ఆమెను తీసేస్తున్నట్లు, దర్శకులు ఆమెకు బదులుగా వేరే వారిని తీసేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు పూజా ఇప్పుడు షాహీద్ కపూర్‌తో కలిసి ‘దేవ’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది.
అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్‌కు సాయం చేసినట్లు టాక్ నడుస్తోంది.మరి ఆ ప్రాజెక్టుల ద్వారా ఆమె మూడు కోట్లు పొందుతుందా అనేది ఇప్పుడు ప్రశాంతకం.
స్టార్ హీరో ప్రభాస్ కాలికి గాయం.. ఈ స్టార్ హీరో త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్!