వరుణ్ సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే

మెగా ప్రిన్స్ వరుణ్తేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రీమేక్ గా తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నడుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా డబాష్మాష్ తో ఫేమస్ అయిన తమిళ మోడల్ ని తీసుకున్నారని ఆ మధ్య టాక్ వినిపించింది.

అయితే తాజాగా ఈ సినిమా కోసం హరీష్ శంకర్ మరో స్టార్ హీరోయిన్ ని తెరపైకి తీసుకు వచ్చాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ వరుస అవకాశాలతో దూసుకుపోతున్న పొడుగుకాళ్ల సుందరి పూజ హెగ్డే అని వాల్మీకి సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

మహర్షి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కు జోడిగా నటిస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ భామ మరోవైపు క్రేజీ ప్రాజెక్ట్ ల తో ఫుల్ బిజీగా ఉంది అని చెప్పాలి.

అయితే ఊహించని విధంగా హరీష్ శంకర్ తన గత సినిమా అయినా హీరోయిన్ గా చేసిన పూజ అని వాల్మీకి లో వరుణ్ తేజ్ కి జోడిగా తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇందులో హీరోయిన్ పాత్ర కోసం పూజ హెగ్డే ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది ఆయన కూడా నిర్మాతలు ఈ భారీ మొత్తం ఇవ్వడానికి రెడీ అయ్యి పూజ హెగ్డే హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

పూజా హెగ్డే తెలుగులో మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

మళ్లీ చాలా గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ గా వరుణ్ తేజ్ కి జోడీగా నటించబోతు ఉండటం విశేషం.

మానవత్వం మంటగలిసింది.. శవం కాళ్లకు గుడ్డ కట్టి ఎలా ఈడ్చుకెళ్లారో చూస్తే..