బుట్ట బొమ్మ సినీ కెరీర్ సమాప్తం అయినట్లేనా.. ఈ సంకేతాలు ఏంటి?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ గా డీజే సినిమా సమయం నుండి కొనసాగుతూ వస్తున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే( Pooja Hegde ).

మధ్యలో చిన్న చిన్న ఫెయిల్యూర్స్ పడ్డా కూడా ఈ అమ్మడికి స్టార్‌ హీరోలు అందరి తో కూడా నటించే అవకాశాలు దక్కాయి.

కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ మధ్య కాలంలో ఈమె తీవ్రంగా ఫ్లాప్స్ ను ఎదుర్కొంటూ ఉంది.

హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకున్న గుంటూరు కారం సినిమా( Guntur Karam ) మేకర్స్ ఇప్పుడు ఆమెను తప్పించారనే వార్తలు వస్తున్నాయి.

"""/"/ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఆమెను తొలగించి మెయిన్‌ హీరోయిన్‌ గా శ్రీ లీల( Sreeleela ) ను ఎంపిక చేయడం జరిగిందట.

మహేష్ బాబు( Mahesh Babu ) ఒత్తిడి తోనే వ్యవహారం జరిగిందని కొందరు అంటూ ఉంటే త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ లో మార్పులు చేయడం వల్ల పూజా హెగ్డే పాత్ర పోయింది అంటూ కొందరు అంటున్నారు.

మొత్తానికి గుంటూరు కారం సినిమా మిస్ అవ్వడంతో పూజా హెగ్డే సినీ కెరీర్ ఖతం అయినట్లుగా సంకేతాలు వస్తున్నాయి.

మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌ సినిమా చేస్తే మరో రెండు మూడు సంవత్సరాల పాటు ఎలాంటి ఢోకా లేకుండా పూజా హెగ్డే ఇండస్ట్రీ లో ఉండేది.

కానీ గుంటూరు కారం నుండి మిస్‌ అవ్వడంతో ఆమె మళ్లీ ఎక్కడ కనిపిస్తుందో తెలియని పరిస్థితి.

"""/"/ అందుకే పూజా హెగ్డే కెరీర్‌ సమాప్తం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే టాలీవుడ్‌( Pooja Hegde Tollywood ) లో ఆఫర్లు లేకున్నా కూడా ఈ అమ్మడికి బాలీవుడ్‌ లో గుర్తింపు ఉంది.

కాస్త జాగ్రత్తగా ప్రయత్నిస్తే ఈ అమ్మడికి అక్కడ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏం జరుగుతుందో చూడాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.పూజా హెగ్డే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరో రెండు మూడు ఏళ్లు ఉండాలి అంటే ఒక సాలిడ్ సక్సెస్ పడాల్సి ఉంది.

మరి ఆ సక్సెస్ పడేనా చూడాలి.

బాలయ్య పై ముద్దుల వర్షం కురిపించిన టాలీవుడ్ హీరో…. ఏదో తేడాగా ఉందంటున్న నేటిజన్స్?