ఆ క్షణమే నా వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తాను: పూజా హెగ్డే
TeluguStop.com
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే ( Pooja Hedge ) ప్రస్తుతం ఉత్తరాది సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
గత ఏడాది వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడిన ప్రస్తుతం ఈమె వరుస అవకాశాలను అందుకొని సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.
సల్మాన్ ఖాన్( Salman Khan ) హీరోగా నటించిన కిసీ కా భాయ్ కీసీ కీ జాన్ ( Kisi Ka Bhai Kisi Ki Jaan ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పూజ హెగ్డే తన సినీ కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావించారు.
"""/"/
ఇకపోతే గత కొద్దిరోజులుగా ఈమె సల్మాన్ ఖాన్ తో డేటింగ్( Salman Khan Dating ) లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలు ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానన్న ఒక్క స్టేట్మెంట్ తో తన గురించి వచ్చే వార్తలకు పులిస్టాప్ పెట్టారు.
దక్షిణాది రాష్ట్రంలో ఎన్నో సక్సెస్ లు అందుకున్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood )లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారని చెప్పాలి.
ఈ విషయం గురించే పూజా హెగ్డే మాట్లాడుతూ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని తెలియజేశారు.
"""/"/
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఒక నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తాను సాధించాల్సింది చాలా ఉందని తెలిపారు.
ఒకసారి నేను అనుకున్న లక్ష్యాన్ని చేరిన క్షణమే తాను తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తానని అప్పటివరకు తన దృష్టి కేవలం సినిమాలపై మాత్రమే ఉంటుంది అంటూ ఈ సందర్భంగా పూజ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఈమె తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
దిల్ రాజు బ్యానర్ లో చరణ్ మరో సినిమా.. ఆ మూవీతో నష్టాలు తీరనున్నాయా?