ఆ కారణంతోనే గుంటూరు కారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది… క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే?
TeluguStop.com
సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి పూజా హెగ్డేకు( Pooja Hedge ) గత కొద్దిరోజులుగా ఏమాత్రం ఇండస్ట్రీలో కలిసి రాలేదని తెలుస్తుంది.
ఈమె నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలవడమే కాకుండా ఈమె కమిట్ అయిన సినిమాల నుంచి కూడా తప్పుకుంటూ ఉండటంతో ఈమె కెరియర్ పరంగా కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని తెలుస్తుంది.
ఇక ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మహేష్ బాబు ( Mahesh Babu) కాంబినేషన్లో వస్తున్నటువంటి గుంటూరు కారం ( Gunturu Kaaram )సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
"""/" /
ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.అయితే ఇందులో పూజా హెగ్డేతో పాటు మరొక హీరోయిన్ శ్రీలీల ( Sreeleela ) కూడా ఉన్నారు.
ఇలా ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా జరుగుతూ వస్తుంది.ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ వార్తల పై పూజా హెగ్డే టీం స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన పూజా టీమ్ ఇది నిజమేనని చెప్పేశారు.
"""/" /
ప్రస్తుతం పూజా హెగ్డే ఇతర సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవ్వడమే కాకుండా తన ఇతర సినిమా షూటింగులకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతోనే ఈమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలియజేశారు.
ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో మరొక హీరోయిన్ గా నటిస్తున్నటువంటి శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.
ఏది ఏమైనా మహేష్ బాబు సినిమా నుంచి పూజా హెగ్డే తప్పు కొని తప్పు చేశారా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ షిప్ కెప్టెన్‌కు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనేషన్ అవార్డ్!