బయటపడాలి అంటే కొంత సమయం పడుతుంది… కెరియర్ పై పూజా హెగ్డే కామెంట్స్ వైరల్!
TeluguStop.com
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి పూజా హెగ్డే( Pooja Hegde ) ఒకరు.
ఈమె ఒక లైలా కోసం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాషలో కూడా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి పూజా హెగ్డేకు ఇటీవల కాలంలో సౌత్ సినిమాలలో పెద్దగా అవకాశాలు రాలేదు.
ఇలా సౌత్ ఇండియన్ సినిమాలలో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఒకానొక దశలో ఏమాత్రం తీరిక లేకుండా గడిపారు.
అయితే స్టార్ హీరోలు అందరి సరసన పూజ హెగ్డే నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో ఈమెకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి చాలా రోజుల తర్వాత ఓ బాలీవుడ్ సినిమా ద్వారా పూజా హెగ్డే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
షాహిద్ కపూర్( Shahid Kapoor ) హీరోగా నటించిన దేవా( Deva ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే తన కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
"""/" /
నాకు ఇండస్ట్రీలో ఎలాంటి బంధు ప్రీతి లేదు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా న్యాయవాదులే నా తమ్ముడు ఆర్తో సర్జన్.
ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తాను ఇండస్ట్రీలోకి వస్తానని ఎప్పుడూ కూడా అనుకోలేదు.
ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు ఇది నా ఊహకి అందని విషయం అంటూ పూజా హెగ్డే తెలిపారు.
అనుకోకుండా ఇండస్ట్రీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని తాను ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించానని తెలిపారు.
నేను నా కెరియర్ లో చాలా దూరం ప్రయాణించి వచ్చాను కానీ ఇంకా ప్రయాణించాల్సి ఉందని తెలియజేశారు.
"""/" /
సినిమాలను నేను ఎప్పుడు ఒత్తిడిగా ఫీల్ అవ్వలేదు అదేవిధంగా నటనలో నేను స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అనేది కూడా నేర్చుకోలేదు.
ఎందుకంటే కొన్ని పాత్రలు ఇప్పటికీ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది.అలాంటి పాత్రలలో రాధే శ్యామ్,( Radhe Shyam ) రెట్రో( Retro ) వంటి సినిమాలలో నా పాత్రలు కూడా ఒకటని తెలిపారు.
కొన్నిసార్లు మనం ఎంచుకున్న పాత్రల నుంచి కూడా బయట పడాలి అంటే కొంత సమయం పడుతుంది అంటూ పూజా హెగ్డే ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వామ్మో, అమ్మాయిలు ఇంత డేంజర్‌గా ఉంటారా.. ప్రియుడికి విషమిచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్.. చివరకు..?