బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇంటిని చూశారా.. ఇంద్ర భవనాన్ని తలపిస్తోందిగా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈమె బాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

కాగా ఈమె ఇటీవలే రాధేశ్యామ్, ఆచార్య, అలాగే బీస్ట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.అయితే ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తున్నాయి.

కాగా పూజా హెగ్డే ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వాణిజ్య ప్రకటనలో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా పూజ హెగ్డే కి ఇంటికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో పూజా హెగ్డే తన ఇంటిని అభిమానులకు పరిచయం చేసింది.అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌ తో అలంకరించిన తన కలల సౌధాన్ని వివరిస్తూ ఓ వీడియోలో వివరించింది.

అత్యంత ఖరీదైన ఇంటి నిర్మాణాన్ని ఓ రీల్‌ వీడియోతో ఫ్యాన్స్‌కు వివరిస్తూ ఆమె ఇంటిని పరిచయం చేసింది.

"""/"/ ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఈజ్ సీరీస్ వీడియోలలో భాగంగా పూజా హెగ్డే తన ఇంటిని ట్రైలర్ రూపంలో చూపించింది.

కాగా ఆ వీడియోలో పూజా తన ఇంటి డిజైన్ వివరిస్తూ.నా తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నారు.

మా నాన్న ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చి పని ఒత్తిడిని ఎప్పుడు తీసుకురాలేదు.

ఆయన ఒక చిన్నపిల్లడిలా మాతో ఆటలు ఆడేవారు.దానికి ప్రధాన కారణం మా ఇంటి వాతావరణమే అని చెప్పుకొచ్చింది బుట్టబొమ్మ.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై వరుస విమర్శలు.. ఇంత నెగిటివిటీకి కారణాలివేనా?