హల్వా చేసుకొని తిన్న హాట్ భామ
TeluguStop.com
కరోనా నేపథ్యంలో షూటింగ్ లు అన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.దీనితో ఒక్కొక్క స్టార్ తమలోని టాలెంట్ ను బయటపెడుతూ పలు వీడియో లు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో కొందరు స్టార్స్ బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తుండగా,మరికొందరు ఇంటి పనులు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు.
ఇంకొందరు అయితే తమలో ఉన్న కుక్ ని బయటకు పిలుస్తున్నారట.ఈ కోవలోనే తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే కూడా చేరింది.
అందుకే వేడివేడిగా క్యారెట్ హల్వా చేసుకొని ఈ అమ్మడు చక్కగా లాగించిందట.దీనికి సంబందించిన ఫోటోను షేర్ చేసి తన అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు పొందుతూ బిజీ హీరోయిన్ గా మారిపోయిన పూజా గతంలో అల్లు అర్జున్ సరసన,ఎన్ఠీఆర్,మహేష్ బాబు లతో కలిసి నటించి మంచి హిట్స్ ను కొట్టింది.
దీనితో ఆమెకు క్రేజ్ మరింత పెరిగింది.మరోపక్క బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ ముద్దు గుమ్మ అక్కడ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.
ఇప్పటికే బాలీవుడ్ హౌస్ ఫుల్-4 లో అవకాశం కొట్టేసిన పూజా మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం కనిపిస్తుంది.
అయితే ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అటు సీరియల్ నటులు,సినిమా నటులు అందరూ కూడా ఇళ్లకే పరిమితమై ఉంటున్నారు.
"-vertical""/"/
దీనితో ఇలా ఎవరికీ తోచింది వారు చేస్తూ వీడియోలు,ఫోటోలు షేర్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు.
నిత్యం షూటింగ్స్ తో బిజీ గా ఉండే వీరంతా ఇళ్లల్లో ఖాళీ గా ఉండలేక ఇలా తమ తమ పనుల్లో బిజీ అయిపోతున్నారు.
మొత్తానికి ఈ ముద్దు గుమ్మ పెట్టిన ఫోటోలను చూసిన నెటిజన్స్ మాస్టర్ చెఫ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ది రాజాసాబ్ మూవీ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. మారుతి రియాక్షన్ ఇదే!