Pooja Hegde : వరుస ఫ్లాపుల వల్ల పూజా హెగ్డే పారితోషికం తగ్గిందా.. రెమ్యునరేషన్ ఎన్ని రూ.కోట్లంటే?

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే( Pooja Hegde ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఏడాది ముందు వరకు తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన పూజా హెగ్డే ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది.

మొన్నటి వరకు స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణించింది.

దానికి తగ్గట్టుగానే పారితోషికం అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడిపింది.కానీ ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తగ్గడంతో పాటు అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.

"""/" / వరుసగా తన సినిమాలు ఫ్లాప్ కావడం దానికి తోడు గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్( Guntur Karam, Ustad Bhagat Singh ) లాంటి క్రేజీ ప్రాజెక్టుల నుంచి బయటికి వచ్చేయడంతో ఆమె కథ తిరగబడింది.

కొత్త అవకాశాలు ఆగిపోయాయి.సడెన్‌గా కెరీర్ డల్ అయిపోయింది.

తెలుగులో అసలు అవకాశాలే లేకుండా ఖాళీ అయిపోవడం అనూహ్యం.పూజా కూడా తెలుగు సినిమాలను లైట్ తీసుకుని బాలీవుడ్లో బిజీ అవ్వాలని చూస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కానీ అక్కడ కూడా ఆమె కెరీర్ ఏమీ ఆశాజనకంగా లేదు.దీంతో మళ్లీ తెలుగు సినిమాల మీద ఆమె ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

ప్రస్తుతం చేతుల్లో సినిమా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్ లతో అందాల కనువిందు చేస్తోంది.

"""/" / ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం పూజా ఎన్నడూ లేని విధంగా డిస్కౌంట్ బేరాలు సాగిస్తున్నట్లు సమాచారం.

ఇంతకముందు 3 కోట్లకు అటు ఇటుగా పారితోషకం( Remunaration ) పుచ్చుకున్న పూజ ఇప్పుడు అందులో సగం మొత్తానికి కూడా సినిమా చేయడానికి రెడీగా ఉందట.

అంటే కేవలం కోటిన్నర ఇచ్చినా కూడా సినిమాలలో పూజా నటించడానికి ఓకే చెబుతోందట.

మిడ్ రేంజ్ సినిమాలు చేయడానికి కూడా ఆమె సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం.తాజాగా పూజా సౌత్ సినిమాలకు శైలికి తగ్గట్లు ట్రెడిషనల్ లుక్స్‌తో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది పూజా.

ఆమెలో ఛార్మ్ ఎంతమాత్రం తగ్గలేదనిపిస్తోంది.మరి పూజా డిస్కౌంట్ బేరాలు ఆమెకు అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి.

అక్కకు పెళ్లి చేసి తమ్ముడు ఆత్మహత్య..!