రిస్క్ లో బుట్ట బొమ్మ కెరియర్..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే కెరియర్ రిస్క్ లో పడ్డదా.మొన్నటిదాకా అమ్మడు చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఆమెకి బ్యాడ్ లక్ నడుస్తుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ఫెయిల్యూర్ అవడం ఆమె కెరియర్ ని డైలమాలో పడేశాయి.

ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన రాధే శ్యాం, విజయ్ బీస్ట్ తో పాటుగా రీసెంట్ గా వచ్చిన ఆచార్య సినిమా కూడా నిరాశపరచింది.

మెగస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా పూజా హెగ్దే ఖాతాలో ఫ్లాప్ సినిమాగా మిగిలింది.

చేసిన 3 సినిమాలు ఫ్లాప్ అవగా ఇప్పుడు అమ్మడి చేతిలో ఉన్న సినిమాలకు టెన్షన్ పట్టుకుంది.

మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా చేస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో కూడా పూజా హెగ్దే నటిస్తుంది.

ఈ రెండు సినిమాలతో అయినా పూజా హెగ్దే హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్25, మంగళవారం 2024