పూజా హెగ్డే ట్వీట్ దెబ్బకి దిగి వచ్చిన ఎయిర్ టెల్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి దూసుకొస్తున్న మంగళూరు భామ పూజా హెగ్డే ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.

మరో వైపు బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

ఈ నేపధ్యంలో పూజా ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది.అయితే ఈ భామ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు ఆ ట్వీట్ దెబ్బకి ఎయిర్ టెల్ సంస్థ కూడా వెంటనే దిగి వచ్చి సమస్య పరిష్కరించింది.

దేశ వ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజర్స్ అయితే జియో లేదంటే ఎయిర్ టెల్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

అయితే ప్రజల నుంచి కోట్ల రూపాయిలు ఆదాయం సంపాదిస్తున్న సదరు సంస్థలు నెట్ వర్క్, సిగ్నల్ సమస్యలని మాత్రం పరిష్కరించే ప్రయత్నం చేయరు.

సామాన్యులు ఎన్నిసార్లు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసిన అంతగా రెస్పాన్స్ ఉండదు.

అయితే తాజాగా పూజా హెగ్డే కూడా ఎయిర్ టెల్ తో ఇలాంటి సిగ్నల్ సమస్యని ఎదుర్కొంది.

ఎయిర్ టెల్ నెట్ వర్క్ తో నేను విసిగిపోయ, ఇంత చెత్త సర్వీస్, చెత్త వ్యవస్థ ఎప్పుడు చూడలేదు.

చాలా రోజులుగా ఎయిర్ టెల్ వాడుతున్న, ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది.

ఈ సంస్థ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటూ ట్వీట్ చేసింది.సెలబ్రిటీ ట్వీట్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో వ్యాపార సంస్థలకి తెలియంది కాదు.

అందుకే ఈమె ట్వీట్ చూడగానే సదరు ఎయిర్ టెల్ సంస్థ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పూజా హెగ్డేకి సారీ చెప్పి సమస్యని పరిష్కరించింది.

దీనిపై స్పందించిన పూజా ఎయిర్ టెల్ కి థాంక్స్ చెప్పి నా ట్వీట్ మిగిలిన వినియోగదారులకి మెరుగైన సేవలు అదించడానికి ఉపయోగపడుతుంది అని ట్వీట్ చేసి ఈ ఇష్యూకి ముగింపు పలికింది.

కార్తీకదీపం సీక్వెల్ డొల్ల అని అభిమానులు.. మోనిత లేకపోవడమే మైనస్ అయిందా?