ఆయనతో పని చెయ్యడం నా అదృష్టం.. పూజా హెగ్డే కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ప్రస్తుతం పూజా హెగ్డే వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.అంతేకాకుండా ఈ బుట్టబొమ్మ హీరోలకు, దర్శక నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా కూడా మారిపోయింది.
బాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.కాగా ఈమె ఇటీవలే రాధే శ్యామ్, ఆచార్య, అలాగే బీస్ట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.ఇకపోతే ప్రస్తుతం పూజా హెగ్డే కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కభీ ఈద్ కభీ దివాళి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అలాగే బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ తో కలిసి సర్కస్ సినిమా కూడా చేస్తోంది.
ఇవేకాకుండా పలు సినిమాలతో జోరు మీద ఉంది.సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉంటోంది పూజా.
ఇటీవల బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి మాజా యాడ్‌లో కలిసి నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ యాడ్‌లో అమితాబ్‌తో కలిసి నటించడం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
"""/"/
అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం.నాలాంటి వారికి అమితాబ్ గురువులాంటివారు.
ఇంత వయసులో కూడా ఆయన సమయపాలన, డెడికేషన్ నాకెంతో నచ్చాయి.ఆయన మనవరాలిగా నటిస్తున్నప్పుడు చెప్పలేని అనుభూతికి లోనయ్యాను అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.
కాగా ప్రస్తుతం పూజ హెగ్డే ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరొకవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ తనకు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు చేస్తూ మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది ఈ బుట్ట బొమ్మ.
చాక్లెట్ ప్లేన్‌గా ఉందని కస్టమర్ ఫిర్యాదు.. కంపెనీ అతనికి చెల్లించిన నష్టపరిహారం ఎంతంటే..?