2022 లో పూజా హెగ్డే పరిస్థితి దారుణం

బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ సంవత్సరం అన్ని విధాలుగా నిరాశ పరిచింది.

ఈ సంవత్సరం ఆరంభం లో ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

అత్యంత దారుణమైన కలెక్షన్స్ నమోదు చేసుకోవడం తో పూజ హెగ్డే కెరియర్ తల కిందులు అయింది అన్నట్లుగా ప్రచారం జరిగింది.

ఆ సినిమా తర్వాత తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా పర్వాలేదన్నట్లుగా టాక్‌ దక్కించుకున్నా కూడా అందులో పూజా హెగ్డే పాత్ర చాలా తక్కువ ఉండడంతో జనాలు ఆమె ని పెద్ద గా పట్టించుకోలేదు.

ఆ తర్వాత ఆచార్య సినిమా లో చిన్న పాత్ర ను పోషించిన పూజ హెగ్డే మరో సారి ఫ్లాప్ చవి చూసింది.

ఇక ఎఫ్ 3 సినిమా లో ఐటెం సాంగ్ చేయడం ద్వారా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజ హెగ్డే ఆ సినిమా తోనూ సక్సెస్ దక్కించుకోలేక పోయింది.

"""/"/ చివరగా ఈ ఏడాది చివర్లో సర్కస్ అనే హిందీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రణవీర్ సింగ్ హీరో గా నటించిన సర్కస్ సినిమా ఫలితం కూడా నిరాశ మిగిల్చింది.

అత్యంత దారుణమైన ఈ సంవత్సరం ఆమెకి అన్ని విధాలుగా ఫెయిల్యూర్ నే ఇవ్వడం తో వచ్చే సంవత్సరం పై ఆమె ఆశలు పెట్టుకుంది.

వచ్చే సంవత్సరం ఆమె నటిస్తున్న మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా విడుదల అవ్వడం తో పాటు సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సినిమా లో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న రెండు సినిమా లు ఆమె కు 2023లో కచ్చితం గా సూపర్ హిట్ అందిస్తాయని అంతా నమ్మకం గా ఉన్నారు.

పూజా హెగ్డే తెలుగు, తమిళం మరియు హిందీ భాషల నుండి ఆఫర్లను దక్కించుకుంటుంది కానీ సక్సెస్ లను మాత్రం సొంతం చేసుకోలేక పోతుంది.

2023 లో కూడా ఫెయిల్యూర్స్ అయితే ఆమె కెరీర్ ఖతం అయినట్లే.

నెలసరి క్రమం తప్పకుండా రావాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!