మరోసారి ఐటెం సాంగ్ తో అదరగొట్టబోతున్న పూజా బేబీ..

పూజా హెగ్డేటాలీవుడ్ టాప్ హీరోయిన్.వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది.

తెలుగులో వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.

తొలి సినిమా నుంచే హిట్ హీరోయిన్ గా మారిపోయింది.రెండో సినిమా అక్కినేని అబ్బాయి నాగ చైతన్యతో చేసింది.

ఒక లైలాకోసంలో నటించి మెప్పింది.అయితే కెరీర్ తొలినాళ్లలో పెద్ద హిట్ మాత్రం పడలేదు.

సాలిడ్ హిట్ కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.కొంత కాలం తర్వాత ఆమె ప్రయత్నం ఫలించింది.

నందమూరి కుర్రాడు ఎన్టీఆర్ తో కలిసి అరవింత సమేత వీర రాఘవ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత అమ్మడు కెరీర్ ఓ రేంజిలో స్వింగ్ తీసుకుంది.వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళ్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.పూజా తాజాగా పాన్ ఇండియన్ రేంజ్ సినిమాల్లో మాత్రమే నటిస్తోంది.

పెద్ద హీరోలంతా ఇప్పుడు పూజాతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. """/"/ అటు రంగస్థలం సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఓ ఐటెం సాంగ్ చేసింది.

రామ్ చరణ్ తో కలిసి జిల్ జిల్ జిల్ జిగేళు రాణి అంటూ కుర్రకారు మదిలో సెగలు రేపింది.

ఈ పాటకు గాను పూజా పాప బాగా డబ్బులు తీసుకుందట.తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందట.

"""/"/ సందీప్ వంగా దర్శకత్వం తెరకెక్కుతున్న తాజా సినిమా యానిమల్ లో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట.

ఇందులో రణ్ బీర్ కపూర్, పరిణీతి చోప్రా కలిసి నటిస్తున్నారు.అనిల్ కపూర్ ఓ కీ రోల్ చేస్తున్నాడట.

ఈ సినిమాలో పూజాతో ఐటెం సాంగ్ చేయించాలి అనుకుంటున్నాడట సందీప్.అయితే ఈ సాంగ్ చేయడానికి పూజా ఓ కండీషన్ పెట్టిందట.

అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తేనే ఓకే చెప్తానంటుందట.కాస్త భారీగా రెమ్యునరేషన్ అడిగినా.

ఇచ్చేందుకు దర్శకుడు వెనుకాడ్డం లేదట.త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఈ పాటకు సైన్ చేసే అవకాశం ఉందట.

మహేష్ బాబు 6 నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాడు..జక్కన్న ఇంకెప్పుడయ్యా షూంగ్ మొదలు పెట్టేది…