ఆ స్టార్ హీరోల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న పూజ హెగ్డే... ?

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే హిట్ టాపిక్ గా మారింది.

ఎందుకంటే ఇప్పుడు వస్తున్న స్టార్ హీరోల సినిమాలకు ఈమె మొదటి ఛాయిస్ గా మారుతున్నారు.

అందుకే పూజ కు టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగింది.ముఖ్యంగా "అలా వైకుంఠపురంలో" సినిమా విజయం తర్వాత పూజకు అవకాశాల వెల్లువ ఊపందుకుంది.

తాజాగా చూస్తే ఈమెకు అన్నీ స్టార్ హీరోల ప్రాజెక్టులు ఉండడం గమనార్హం.సౌత్ లో ఉన్న టాప్ హీరోలు పూజనే మాకు హీరోయిన్ గా కావాలి అని పట్టుబడుతున్నారట.

ఆటోమాటిక్ గా డిమాండ్ ఎక్కువ అయితే వస్తువు విలువ పెరిగిపోతుంది.సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది.

పూజ ఈ దెబ్బతో ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట.

ఇది అంతా ఇంతకు ముందు వరకు ఉన్న కథ.అయితే సడెన్ గా సీన్ మారిపోయింది.

కరెక్ట్ గా మూడే మూడు సినిమాలు పూజాను మళ్లీ నేలకు దించేశాయి.ఎందుకంటే.

పూజ హెగ్డే ఈ సంవత్సరం తీసిన మూడు సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి.మొదటగా మార్చి రెండవ వారంలో పాన్ ఇండియా సినిమాగా రాధే శ్యామ్ వచ్చింది.

ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పూజ హెగ్డే లు నటించారు.ఈ సినిమాకు యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు.

కానీ ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా మోసం చేసింది.కనీసం ఏవరేజ్ మూవీ గా కూడా ప్రజల మనసులో స్థానాన్ని పొందడంలో విఫలం అయింది.

మొదటి నుండి సినిమాపై ఉన్న అంచనాలు ఫలితాన్ని మాత్రం మార్చలేకపోయాయి.దీనితో పూజ హెగ్డే కు మూడు సినిమాల హిట్ తర్వాత డిజాస్టర్ తన ఖాతాలో పడింది.

ఇక ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్ తో చేసిన బీస్ట్ మూవీ కూడా అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది.

"""/" / మంచి రేంజ్ లో ఉన్న విజయ్ సినిమా ఇంత రేంజ్ లో ప్లాప్ అవడంతో తమిళనాట విజయ్ అభిమానులు పూజ హెగ్డే ను మామూలుగా తిట్టడం లేదు.

అలా వరుసగా రెండు సినిమాలు దెబ్బ తిన్నాయి.ఇక ఈ రెండు సినిమాల ప్రభావంతో ముచ్చటగా మూడవ సినిమాగా వచ్చిన ఆచార్య పై ముందుగానే అనుమానాలు తలెత్తాయి.

అయితే అనుకున్న విధంగానే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండే ప్లాప్ టాప్ తెచ్చుకుని డిజాస్టర్ దిశగా వెళుతోంది.

ఇలా హ్యాట్రిక్ విజయాల తర్వాత పూజ హెగ్డే కు హ్యాట్రిక్ ప్లాప్ తనను బాగా దెబ్బ కొట్టాయి.

ఇలా గత సంవత్సరం ముందు వరకు గోల్డెన్ లెగ్ గా ఉన్న పూజా హెగ్డే ఐరన్ లెగ్ గా మారింది.

ఇప్పుడు పూజ హెగ్డే తో సినిమాలు ఫిక్స్ అయిన్ స్టార్ హీరోలకు మరియు డైరెక్టర్ లకు కంటిమీద కునుకు లేదు అని చెప్పాలి.

"""/" / అలా చూస్తే వచ్చే నెలలో రిలీజ్ కానున్న అనిల్ రావిపూడి కామెడీ మూవీ ఎఫ్ 3 లో ఒక సాంగ్ కు పూజ హెగ్డే ఆడిపాడనుంది.

ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రానున్న పాన్ ఇండియా సినిమాలో మొన్ననే పూజ హెగ్డే ను హీరోయిన్ గా లాక్ చేశారు.

ఇక పవర్ స్టార్ తో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ లో చేయనుంది.

ఇక త్వరలో షూటింగ్ మొదలు కానున్న ఎన్టీఆర్ మూవీలో కూడా పూజ నే తీసుకోనున్నారు అని తెలుస్తోంది.

దీనితో ఈ స్టార్ హీరోల గుండెల్లో పూజ హెగ్డే గురించి ఆందోళన మొదలైంది.

మరి పూజ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా ? చూడాలి.

ప్రసన్నవదనం మూవీ రివ్యూ.. సుహాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనా?