లేటు వయస్సులో పెళ్లి చేసుకుని షాకిచ్చిన ప్రముఖ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

ప్రముఖ నటి పూజా గాంధీ( Pooja Gandhi ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

దండుపాళ్యం సినిమాతో( Dandupalyam ) ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న ఈ బ్యూటీ నాలుగు పదుల వయస్సులో పెళ్లి చేసుకున్నారు.

విజయ్ ఘోర్పడే( Vijay Ghorpade ) అనే ప్రముఖ బిజినెస్ మేన్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు.

ఈ నెల 29వ తేదీన బెంగళూరు దగ్గర ఉన్న యలహంకలో వివాహం జరిగింది.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా పూజా గాంధీ వివాహం( Pooja Gandhi Marriage ) జరగడం గమనార్హం.

పూజా గాంధీ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా పెళ్లి తర్వాత ఆమె మరింత సంతోషంగా జీవనం సాగించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ముంగారు పర్మ్ అనే మూవీ కన్నడ ఇండస్ట్రీలో పూజా గాంధీకి మంచి పేరును తెచ్చిపెట్టింది.

పూజా గాంధీ భర్త విజయ్ ఆమెకు కన్నడ భాషను కూడా నేర్పించారని తెలుస్తోంది.

"""/" / విజయ్ స్వభావం నచ్చి ఆమె అతడిని పెళ్లి చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.

పూజా గాంధీ, విజయ్ జోడీ( Pooja Gandhi Vijay ) బాగుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

పూజా గాంధీ బెంగాల్, తమిళ భాషల్లోని సినిమాలలో సైతం నటించినా ఆ సినిమాలు ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడం గమనార్హం.

గతంలో పూజా గాంధీకి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. """/" / అయితే వేర్వేరు కారణాల వల్ల నిశ్చితార్థం ఆగిపోయింది.

పూజా గాంధీ పెళ్లి తర్వాత సినీ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

ఆమె కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.పూజా గాంధీని అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

పుష్ప2 కోసం సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. దిమ్మతిరిగి పోవాల్సిందే!