నాకు యాక్టింగ్ రాదు.. అందుకే శరీరం చూపించా.. పూజాబేడీ సంచలన వ్యాఖ్యలు!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించాలి అంటే కేవలం అందం మాత్రమే ఉంటే సరిపోదు టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి అన్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా యాక్టింగ్ బాగా రావాలి.అప్పుడే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం పాటు రాణిస్తూ ఉంటారు.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటీమణులకు( Actresses ) యాక్టింగ్ రాకపోయినప్పటికీ గ్లామర్ తో మేనేజ్ చేస్తూ ఉన్నారు.
కానీ వాళ్ళు నటించడం రాదు అన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోరు.కానీ ఇప్పుడు బాలీవుడ్ కి చెందిన ఒక నటి మాత్రం ఏకంగా ఈ విషయాన్ని నిర్భయంగా ఒప్పుకుంది.
"""/" /
ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమె ఎలాంటి కామెంట్స్ చేసింది అన్న విషయానికొస్తే.
బాలీవుడ్ నటి పూజా బేడీ ( Actress Pooja Bedi )తనకు అస్సలు యాక్టింగ్ రాదని, దీని నుంచి తప్పించుకునేందుకు బాడీ పార్ట్స్ చూపించి తప్పించుకునేదాన్ని అని షాకింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ ప్రముఖ నటుడు కబీర్ బేడీ కూతురు పూజా బేడీ అన్న విషయం తెలిసిందే.
పలు హిందీ సినిమాల్లో ఈమె నటించగా, అవి హిట్ అయ్యాయి.కాకపోతే ఈమె పెద్దగా మూవీస్ చేయలేదు.
తెలుగులో చిట్టెమ్మ గారి మొగుడు, ఎన్టీఆర్ శక్తి సినిమాలలో నటించింది.ఇవి రెండూ డిజాస్టర్స్ కావడంతో తెలుగులో మరో అవకాశం రాలేదు.
"""/" /
ఇది ఇలా ఉంటే ఇటీవలే ఫిక్కి ఈవెంట్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తనపై తానే సంచలన వ్యాఖ్యలు చేసుకుంది.
తనో దారుణమైన నటి అని తెలిపింది.క్లీవేజ్ చూపించి మేనేజే చేసేదాన్ని అని పూజా బేడీ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం పూజా బేడీ కూతురు ఆలయ బాలీవుడ్ లో హీరోయిన్ గా రానిస్తున్న విషయం తెలిసిందే.
తన కుమార్తె మాత్రం తనలాంటిది కాదని, ఉదయం 6 గంటలకే నిద్రలేస్తుందని యాక్టింగ్ ప్రొఫెషన్ అంటే ఆమెకు డెడికేషన్ అని ఆమె చెప్పుకొచ్చింది.
సరే ఇదంతా పక్కన బెడితే పూజా బేడీ చేసిన లేటెస్ట్ కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
వీడియో: కొమోడో డ్రాగన్ పామును పట్టుకుని ఏం చేసిందో చూస్తే కళ్లు తేలేస్తారు!