నారాయణపూర్ హనుమాన్ దేవాలయంలో పూజలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయంలో కడప అమర్చడానికి శుక్రవారం సర్పంచ్ నిమ్మ లక్ష్మి పూజ చేశారు.
అర్చకులు వేణుగోపాల చారి, శివశాస్త్రిలు పూజలు చేశారు.దేవాదాయ శాఖ నుండి నిధులు మంజూరు చేసి ఆలయ నిర్మాణం పూర్తిచేసుకునే దశలో కడపను అమర్చినట్లు తెలిపారు.
ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన తెలంగాణ మాజీ ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి, రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నునుగొండ మల్లయ్య లకు కృతజ్ఞతలు తెలిపారు.
నెల రోజులలో హనుమాన్ ప్రతిష్ట దేవాలయం పూర్తి అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అపెరా సుల్తానా, ఉపసర్పంచ్ మహేందర్, మాజీ సర్పంచ్ దొమ్మాటి నరసయ్య, రామాలయ కమిటీ చైర్మన్ సూర నరసయ్య, లింగాల నరసయ్య ,నిమ్మ సుధాకర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.
అమెరికా రాష్ట్ర సభలు, లోకల్ బాడీల బరిలో ప్రవాస భారతీయులు .. ఎంత మందో తెలుసా?