ప్రపంచ క్రికెట్ లో భారతీయ క్రికెట్ కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది.
మన దేశంలో క్రికెట్ ను అభిమానించినంత మిగతా ఏ దేశంలో అభిమానించరంటే అతిశయోక్తి కాదు.
మన దేశంలో క్రికెట్ అనేది ఒక మతం, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసే అభిమానులు ఉన్నారంటే భారత క్రికెట్ రేంజ్ ఏంటనేది మనం అర్ధం చేసుకోవచ్చు.
అందుకే భారతదేశంలో క్రికెటర్ లకు కొదవ లేదు.యువ క్రికెటర్ లలో ఎంతో మంది గొప్ప గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు.
అందులో పృథ్వీషా ఒకరు.చిన్నప్పుడే ఒక్కసారిగా క్రికెట్ మేధావుల దృష్టిని ఆకర్షించి అలా స్టేట్ లెవల్ మ్యాచ్ లలో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తూ సచిన్ కు దగ్గరి పోలికలున్న ఆటగాడిగా పృథ్వి షా క్రికెట్ లెజెండ్స్ మన్ననలు అందుకున్నాడు.
అయితే తాజాగా క్రికెట్ లెజెండ్ పృథ్వి షా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
పృథ్వి షా రన్స్ చేసినప్పుడు నెట్ ప్రాక్టీస్ చేసేందుకు ఆసక్తి చూపుతాడని, ఒకవేళ మ్యాచ్ లో రన్స్ చేయకపోతే నెట్ ప్రాక్టీస్ చేసేందుకు ఆసక్తి చూపడని, ఈ లక్షణం ఒక్కటి మార్చుకుంటే పృథ్వి షాను ఎవరూ ఆపలేరని, ఇలాగే కొనసాగిస్తే క్రికెట్ కెరీర్ కే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని పాంటింగ్ అభిప్రాయ పడ్డారు.
మోహన్ బాబు కన్నప్ప మూవీ తర్వాత వేరే హీరోల సినిమాల్లో నటిస్తాడా..?