పొన్నియన్ సెల్వన్ నైజాం వసూళ్లు.. ఎంత రాబట్టిందంటే?

కోలీవుడ్ లో ఇప్పటి వరకు 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలు రాలేదు.

తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చింది.అదే పొన్నియన్ సెల్వన్.

ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు.ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమాను ఎప్పటి నుండో తెరకెక్కించాలి అని అనుకున్న ఇప్పటికి అది సాధ్యం అయ్యింది.

ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రే, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాపై హైప్ ఏర్పడడంతో అందరు ఎలా ఉండబోతుందా అని ఎదురు చూశారు.

మరి ఆ ఎదురు చూపులకు ఇప్పటికి ఫుల్ స్టాప్ పడింది.నిన్న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

అయితే తమిళ్ మీడియా ముందు నుండి ప్రచారం చేసినంత సినిమాలో కంటెంట్ అయితే లేదు.

దీంతో ఈ సినిమా తమిళ్ ప్రేక్షకులను మాత్రమే మెప్పించింది.బాహుబలి రేంజ్ కాదు కదా ఈ సినిమా దరి దాపుల్లో కూడా ఈ సినిమా రేంజ్ లేకపోవడం గమనార్హం.

అయితే ఓపెనింగ్స్ మాత్రం ఈ సినిమాకు బాగానే వచ్చినట్టు టాక్.ముందు నుండి బాగా ప్రొమోషన్స్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ తోనే రిలీజ్ అయ్యింది.

"""/" / ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం లో ఈ సినిమా బాగానే కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకు అక్కడ ఫస్ట్ డే 2.3 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తుంది.

మరి ఇది మంచి నెంబర్ అనే చెప్పాలి.అలాగే వీకెండ్ వసూళ్లు కూడా బాగానే వచ్చేట్టు అనిపిస్తుంది.

ఎందుకంటే ఈ సినిమాను మినహా పెద్దగా వేరే సినిమాలు లేకపోవడంతో దీనికి ప్లస్ అనే చెప్పాలి.

చూడాలి మరి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో.